నటికి కరోనా పాజిటివ్.. చనిపోవాలని కోరుకుంటున్నానంటూ..

ABN , First Publish Date - 2022-01-08T14:00:24+05:30 IST

ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ప్రజల్లో కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడ్డారు..

నటికి కరోనా పాజిటివ్.. చనిపోవాలని కోరుకుంటున్నానంటూ..

ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ ప్రజల్లో కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలో నటి స్వర భాస్కర్ కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే.


ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది నటి స్వర. కరోనా నిబంధనల ప్రకారం క్యారంటైన్‌లో ఉన్నట్లు తెలిపింది ఈ బ్యూటీ. మామూలుగా ఎవరైనా సెలబ్రిటీలు దీని బారిన పడితే త్వరగా కోలుకోవాలంటూ మెసేజులు పెడుతుంటారు నెటిజన్లు. కానీ ఈ భామని మాత్రం విపరీతంగా ట్రోల్ చేశారు.


‘మోదీ మీద నిందలు వేసి ఈ విషయాన్ని క్లోజ్ చేయండి దీదీ’ అంటూ ఒకరు కామెంట్ పెట్టగా.. ‘కరోనాను చూస్తే బాధగా ఉంది’ అంటూ మరొకరు.. ఇంకొక నెటిజన్ అయితే మరి రెచ్చిపోయి.. ‘2022లో ఇప్పటి వరకు నేను విన్న అన్ని వార్తల్లో అత్యుత్తమమైనది ఇదే. ఆమె చనిపోయి నరకంలో కూడా చోటు పొందకుండా ఉంటుందనుకుంటున్నా. అడ్వాన్స్‌గా నరకంలో విశ్రాంతి తీసుకోండి’ కామెంట్ పెట్టాడు. ‘మీ మరణ వార్త కోసం ఎదురుచూస్తూ ఉంటాన’ని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.











Updated Date - 2022-01-08T14:00:24+05:30 IST