మీకు ఏ షాట్ నచ్చింది.. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతానంటున్న సన్నీ లియోన్

ABN , First Publish Date - 2022-03-25T00:11:06+05:30 IST

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన సుందరి సన్నీ లియోన్

మీకు ఏ షాట్ నచ్చింది.. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతానంటున్న సన్నీ లియోన్

పోర్న్ స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించి హీరోయిన్‌గా మారిన సుందరి సన్నీ లియోన్. ‘జిస్మ్-2’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘జాక్‌పాట్’, ‘రాగిణీ ఎంఎంస్-2’, ‘హేట్ స్టోరీ-2’ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించింది. ‘కరెంటు తీగ’, ‘గరుడ వేగ’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ మధ్యనే ‘అనామిక’ వెబ్ సిరీస్‌లో కనిపించి అందరినీ అలరించింది. తాజాగా సన్నీ  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే..


శృంగార తార సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలసి హాలీడేను ఎంజాయ్ చేస్తుంది. సినిమాల నంచి విరామం లభించడంతో మాల్దీవుల్లోని బీచ్‌‌లో ఆమె సేద తీరుతోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తీసుకున్న ఫొటోలను గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ట్విట్టర్‌లోను కొన్ని పిక్స్‌ను షేర్ చేసింది. రెడ్ కలర్ బికినీలో తీసుకున్న ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుంది. ‘‘ మీకు ఏ షాట్ నచ్చింది. నాకు ఇష్టమైనది తర్వాత చెబుతాను’’ అని ఆమె కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం సన్నీ టాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటిస్తుంది. ఈ మూవీలో గాలి రేణుక అనే పాత్రలో ఆమె కనిపించనుంది. 


సన్నీ లియోన్ అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రా. సన్నీ 2011లో బిగ్ బాస్-5లో పాల్గొంది. ఈ రియాలిటీ షో చేసినప్పుడు ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అనంతరం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పూజా భట్ దర్శకత్వం వహించిన ‘జిస్మ్-2’తో బీ టౌన్‌లో కెరీర్ ఆరంభించింది.




Updated Date - 2022-03-25T00:11:06+05:30 IST