రూ.కోట్ల మేరకు మోసపోయిన సోనమ్ కపూర్ మామయ్య

ABN , First Publish Date - 2022-03-13T00:20:17+05:30 IST

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మామయ్య‌ హరీష్ అహుజాను కొంతమంది

రూ.కోట్ల మేరకు మోసపోయిన సోనమ్ కపూర్ మామయ్య

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మామయ్య‌ హరీష్ అహుజాను కొంతమంది నిందితులు మోసం చేశారు. దీంతో నిందితులకు వ్యతిరేకంగా గతేడాది జులైలో ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హరీష్ అహుజాకు ఫరీదాబాద్‌లో షాహీ ఎక్స్‌పోర్ట్ ప్యాక్టరీ అనే కంపెనీ ఉంది. ఎక్స్‌పోర్ట్ కంపెనీలకు ప్రభుత్వం రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లివీస్ లైసెన్స్(ఆర్‌ఓఎస్సీ‌టీఎల్) కింద ప్రోత్సాహకాలు అందిస్తుంది. కొన్ని రకాల సుంకాల్లో రాయితీలు కూడా ఇస్తుంది. కొంతమంది సైబర్ నిందితులు ఈ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకున్నారు. హరీష్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులను కొల్లగొట్టారు. 



ఫరీదాబాద్ డిఫ్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నితీశ్ అగర్వాల్ ఈ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఎగుమతులు, దిగుమతులు చేసే సంస్థలకు ఆర్‌ఓఎస్సీ‌టీఎల్ లైసెన్స్ కింద  ప్రభుత్వం కొన్ని రకాల ప్రోత్సాకాలు అందిస్తుంది. ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలల్లో కొంత రాయితీని కూడా ఇస్తుంది. ప్రభుత్వం ఈ లైసెన్స్‌ను డిజిటల్ కూపన్ల రూపంలో జారీ చేస్తుంది. ఈ డిజిటల్ కూపన్ల విలువ కొన్ని కోట్ల రూపాయాల వరకు ఉంటుంది. హరీష్ అహుజా కంపెనీకి కూడా ప్రభుత్వం అదే విధంగా కొన్ని జారీ చేసింది. కానీ, ఈ కంపెనీకి చెందిన 154 ఆర్‌ఓఎస్సీ‌టీఎల్‌లను సైబర్ నిందితులు దారి మళ్లించారు. వాటి విలువ దాదాపుగా రూ.27.61కోట్లు ఉంటుంది. మోసగాళ్లు నకిలీ కంపెనీలను స్థాపించి డబ్బులను వాటికి బదిలీ చేశారు. ఈ డిజిటల్ కూపన్లను మరికొన్ని కంపెనీలకు కూడా ట్రాన్స్‌ఫర్ చేశారని తెలుస్తోంది. గతేడాది జులై నుంచి ఈ కేసుపై పనిచేస్తున్నట్టు ఫరీదాబాద్ పోలీసులు తెలిపారు. ఢిల్లీ, చెన్నై, కర్ణాటక, ముంబై వంటి ప్రాంతాల్లో దాదాపుగా 9మందిని అరెస్టు చేశామమన్నారు

Updated Date - 2022-03-13T00:20:17+05:30 IST