సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న వైరల్ ఫొటోపై స్పందించిన సోనాక్షి సిన్హా..!

ABN , First Publish Date - 2022-03-05T02:35:43+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడిగా సల్మాన్ ఖాన్‌కు

సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న వైరల్ ఫొటోపై స్పందించిన సోనాక్షి సిన్హా..!

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడిగా సల్మాన్ ఖాన్‌కు పేరుంది. అభిమానుల్లోను హీరోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐదు పదుల వయసు వచ్చినా బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే మిగిలిపోయాడు. పెళ్లి విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. తాజాగా సల్లూ బాయ్ బాలీవుడ్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో వైరల్ కావడంతో అతడు రహస్యంగా సోనాక్షిని పెళ్లి చేసుకున్నాడని పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ఆ ఫొటో కింద నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.


నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోపై తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి స్పందించింది. ‘‘రియల్, ఫేక్ ఫొటోకు తేడాను గమనించలేనంత మూర్ఖంగా మీరు ఉన్నారా’’ అంటూ ఆమె ప్రశ్నించింది. మూడు లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ చేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘దబాంగ్’ చిత్రంతోనే సోనాక్షి బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె కొన్నాళ్లుగా జహీర్ ఇక్బాల్ అనే నటుడితో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం సల్లూ బాయ్ ‘టైగర్-3’లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది ‘ఈద్’ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Updated Date - 2022-03-05T02:35:43+05:30 IST