బ్లాక్ లెహెంగాలో క్యూట్ Sara Ali Khan.. వినయానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2021-12-15T20:39:36+05:30 IST

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన మంచి సినిమాలతో గుర్తింపు పొందిన నటి సారా అలీఖాన్...

బ్లాక్ లెహెంగాలో క్యూట్ Sara Ali Khan.. వినయానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చిన మంచి సినిమాలతో గుర్తింపు పొందిన నటి సారా అలీఖాన్. అనంతరం నటన, అందంతోనే కాకుండా తన డౌన్ టు ఎర్త్ ప్రవర్తనతో ఎంతోమంది అభిమానుల మనసులను కొల్లగొట్టింది. ఈ బ్యూటీ తన ఫ్యాన్స్‌ని, మీడియాని కూడా ఎంతో గౌరవంతో, వినయంగా పలకరిస్తూ ఉంటుంది.


తాజాగా సారాకి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయ్యింది. అందులో ఈ భామ బ్లాక్ లెహెంగాలో ఎంతో క్యూట్‌గా ఉంది. అంతేకాకుండా ఆ వీడియోలో ఈ బ్యూటీ నవ్వుతూ మీడియాని గ్రీట్ చేసింది. ఇది చూసిన ఎంతోమంది ఫ్యాన్స్ ఈ తారని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.


‘ఆమె బాలీవుడ్‌లో ఉన్న వారిలో ఎంతో మర్యాదగా మాట్లాడే వ్యక్తి’ అంటూ కొందరు.. ‘లవ్ లీ.. సిగ్గు పడుతుంటే భలే క్యూట్‌గా ఉంద’ని మరికొందరు.. ‘ఈ బ్యూటీ ఎప్పుడూ నవ్వుతూ సరాదాగా ఉంటుంద’ని ఇంకొందరు.. ‘ఆమె చాలా అందగత్తె.. శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా’ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అందమైన సారా సిగ్గుపడుతూ నమస్కారం పెడుతున్న వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2021-12-15T20:39:36+05:30 IST