షారూఖ్ సినిమాలో ‘దంగల్’ బ్యూటీ స్టంట్స్ చేయనుందా..?

ABN , First Publish Date - 2022-04-24T01:23:01+05:30 IST

‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాన్యా మల్హోత్రా. ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించి అభిమానులను అలరించింది.

షారూఖ్ సినిమాలో ‘దంగల్’ బ్యూటీ స్టంట్స్ చేయనుందా..?

‘దంగల్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సాన్యా మల్హోత్రా. ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించి అభిమానులను అలరించింది. అనంతరం ‘శకుంతలా దేవి’, ‘మీనాక్షి సుందరేశ్వర్’, ‘లవ్ హాస్టల్’ తదితర సినిమాల్లో నటించింది. సాన్యా ఓ భారీ ప్రాజెక్టులో అవకాశం కొట్టేసిందని బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.  

   

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కింగ్ ఖాన్ సరసన సాన్యా భారీస్థాయి యాక్షన్ సన్నివేశాల్లో నటించనుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. షారూఖ్- అట్లీ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో సాన్యాపై గన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ‘‘చిత్రీకరణకు ముందు ఆమెకు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలనుకున్నారు. కానీ, ఆమె షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది. అందువల్లే ట్రైనింగ్ ఇవ్వడం లేదు. షూటింగ్‌లో పాల్గొనడానికి ముందు ఆమె గన్‌తో కొన్ని గంటల పాటు సీన్లను ప్రాక్టీస్ చేయనుంది’’  అని చిత్ర బృందానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. యాక్షన్ సన్నివేశాలను అట్లీ దాదాపుగా వారం రోజుల పాటు షూట్ చేయనున్నారని సమచారం. ఇక సాన్యా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం గునీత్ మొంగా దర్శకత్వంలో ఆమె నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది.


Updated Date - 2022-04-24T01:23:01+05:30 IST