అంతా అత్యధిక టికెట్ల రేట్ల వల్లే.. South సినిమాల కలెక్షన్లపై Bollywood నటి Richa Chadha కామెంట్స్ ఇవీ..!

ABN , First Publish Date - 2022-05-13T18:18:49+05:30 IST

బాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి రిచా చద్దా. గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుని...

అంతా అత్యధిక టికెట్ల రేట్ల వల్లే.. South సినిమాల కలెక్షన్లపై Bollywood నటి Richa Chadha కామెంట్స్ ఇవీ..!

బాలీవుడ్‌లో డిఫరెంట్ సినిమాలు, పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి రిచా చద్దా. గ్యాంగ్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాతో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుని సైతం అందుకుంది. అలాగే 2017లో ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ వెబ్‌సిరీస్‌తో OTTలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నటి తాజాగా బెబీ డాల్ అనే ఆడియో ప్రాజెక్ట్ చేస్తోంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండియన్ సినిమాలు భారీ కలెక్షన్లను సాధించడంపై రిచా కామెంట్స్ చేసింది.


‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ వంటి సౌత్ ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ మూవీస్ దాటిని తట్టుకోలేక పలు బాలీవుడ్ సినిమాలు వెనుకబడ్డాయి.  దీనిపై రిచా మాట్లాడుతూ.. ‘సౌత్ ఇండియన్ సినిమాలకు టికెట్ల రేట్లు 100 నుంచి 400 లోపు మాత్రమే ఉంటాయి.. అందువల్ల ఆ మాత్రం పెట్టడానికి అభిమానులు పెద్దగా ఇబ్బంది పడరు.. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లంతా సినిమాలు చూస్తారు. పెద్ద మొత్తంలో ఓపెనింగ్స్ వస్తాయి. కానీ హిందీలో అలా కాదు. హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా సరే టికెట్ రేటు కనీసం 500 పైనే ఉంటుంది. అంత మొత్తాన్ని పెట్టేందుకు అభిమానులు కూడా ధైర్యం చేయరు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కలెక్షన్లు దారుణంగా ఉంటాయి. 500 రూపాయలు పెట్టి ఇంట్లోకి నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చని భావించే మధ్యతరగతి ప్రజలే ఎక్కువగా ఉంటారు. బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ వర్గం వాళ్ల అత్యాశ వల్ల బాలీవుడ్ సినిమా నష్టపోతోంది. అందుకే ఇక్కడ పంపిణీదారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-05-13T18:18:49+05:30 IST