హాట్ ‌బ్యూటీ విడాకులు.. ఏం జరిగిందో నాకు తెలియదంటూ..

ABN , First Publish Date - 2022-02-14T16:50:32+05:30 IST

హిందీ బిగ్‌బాస్ సీజన్ 1తో పాపులారిటీ సాధించిన నటి రాఖీ సావంత్. అనంతరం మోడల్‌గా, ఐటమ్స్ సాంగ్స్‌తో కెరీర్‌లో ముందుకు దూసుకుపోయింది...

హాట్ ‌బ్యూటీ విడాకులు.. ఏం జరిగిందో నాకు తెలియదంటూ..

హిందీ బిగ్‌బాస్ సీజన్ 1తో పాపులారిటీ సాధించిన నటి రాఖీ సావంత్. అనంతరం మోడల్‌గా, ఐటమ్స్ సాంగ్స్‌తో కెరీర్‌లో ముందుకు దూసుకుపోయింది. కొన్నేళ్ల క్రితం రాఖీ, రితేష్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ముగిసిన బిగ్‌బాస్ సీజన్ 15లో పాల్గొన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.


రాఖీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లో.. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. నేను, రితేష్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్‌బాస్ తర్వాత నాకు తెలియకుండానే కొన్ని విషయాలు జరిగాయి. వాటిని నేను నియంత్రించలేకపోయాను. మేము మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాం. చివరికి మేము ఇద్దరమూ స్నేహపూర్వకంగా ముందుకు సాగడం ఉత్తమమని మంచిదని నిర్ణయించుకున్నాం. ఇద్దరమూ విడివిడిగా మా జీవితాలను ఆనందంగా సాగిస్తామని అనుకున్నాం. అయితే వాలెంటైన్స్ డేకి ముందే ఇది జరిగినందుకు బాధగా ఉంది. కానీ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. విడాకుల తర్వాత కూడా రితేష్ జీవితం బావుండాలని కోరుకుంటున్నా. ఇకపై నా కెరీర్‌పై దృష్టి పెట్టి ముందుకు సాగాలని భావిస్తున్నా. నన్ను అర్థం చేసుకుని మద్దతు ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.





Updated Date - 2022-02-14T16:50:32+05:30 IST