ఎయిర్‌పోర్ట్‌లో భర్త విక్కీకి Katrina Kaif హగ్.. బాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ జంట అంటూ..

ABN , First Publish Date - 2022-01-02T16:01:59+05:30 IST

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే...

ఎయిర్‌పోర్ట్‌లో భర్త విక్కీకి Katrina Kaif హగ్.. బాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ జంట అంటూ..

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ గతేడాది  డిసెంబర్ 9న రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో రహస్యంగా జరిగిన వీరి మ్యారేజ్ గురించి ఈ భామ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కూడా షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు.


అయితే విక్కీ ప్రస్తుతం సారా అలీఖాన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఇండోర్ ‌లో జరుగుతోంది. దీని కోసం శనివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయలు దేరాడు ఈ ‘ఉరి’ స్టార్. అయితే ఇక్కడ విశేషమేమంటే ఆయనను డ్రాప్ చేయడానికి నటుడి శ్రీమతి కత్రినా వచ్చింది. అనంతరం కారులో నుంచి దిగుతూ హగ్ చేసుకుంది. 


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. చాలా ప్రేమతో హబ్బికి క్యాట్ ఇచ్చిన హగ్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. దీనిపై ఫిదా అయిన వారి ఫ్యాన్స్ ‘క్యూట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘బాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ జంట’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్యూట్ వీడియోని మీరు ఓసారి చూసేయండి..



Updated Date - 2022-01-02T16:01:59+05:30 IST