పెళ్లయిన వారం రోజుల తర్వాత Katrina Kaif చేసిన పనికి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

ABN , First Publish Date - 2021-12-17T17:09:02+05:30 IST

బాలీవుడ్‌ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి విషయం ఎంత బజ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎన్నో రూమర్స్ తర్వాత డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది...

పెళ్లయిన వారం రోజుల తర్వాత Katrina Kaif చేసిన పనికి.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

బాలీవుడ్‌ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి విషయం ఎంత బజ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎన్నో రూమర్స్ తర్వాత డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మ్యారేజ్ పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కు తెలిపి.. వారిని ఖుషి చేసింది క్యాట్. 


అంతేకాకుండా వివాహం తర్వాత మొదటిసారి ఈ వారం మొదట్లో భార్యాభర్తలుగా ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించిన ఈ జంట ఫోటోలకి పోజుచ్చింది. అయితే తాజాగా కత్రినా చేసిన ఓ పనితో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెళ్లి సమయంలో విక్కీతో ఉన్న ఫోటోని పెట్టుకుంది. దీంతో దీనిపై చాలామంది అభిమానులు ఈ భామపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారి ప్రేమకి ఇదే నిదర్శం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.





Updated Date - 2021-12-17T17:09:02+05:30 IST