అయ్యయ్యో.. థియేటర్లో జనాలే లేక అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాను కొనేందుకు OTT లు కూడా భయపడుతున్నాయ్..!

ABN , First Publish Date - 2022-05-27T20:38:07+05:30 IST

మాటలను తూటాల్లా పేల్చే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు

అయ్యయ్యో.. థియేటర్లో జనాలే లేక అట్టర్ ఫ్లాప్ అయిన ఆ సినిమాను కొనేందుకు OTT లు కూడా భయపడుతున్నాయ్..!

మాటలను తూటాల్లా పేల్చే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంటుంది. కంగన తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’ (Dhaakad). ప్రపంచవ్యాప్తంగా మే 20న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వీకెండ్‌లోను ఎటువంటి కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయింది. ఈ సినిమా పూర్తి రన్‌లో రూ. 3కోట్లకు కంటే తక్కువ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అట్లర్ ప్లాప్ అయిన ఈ సినిమాను కొనేందుకు ఓటీటీలు కూడా భయపడుతున్నాయి. 


సినిమా విడుదల కాకముందే నిర్మాతలు శాటిలైట్, డిజిట్ రైట్స్‌ను అమ్మేస్తుంటారు. ఈ హక్కులను ముందుగానే అమ్మడం ద్వారా ప్రొడ్యూసర్స్ లాభాలను అర్జిస్తుంటారు. ‘ధాకడ్’ భారీ విజయం సాధిస్తుందని నిర్మాతలు అంచనా వేసి ఉంటారు. అందువల్ల డిజిటల్ రైట్స్‌ను అమ్మలేదు. రిలీజ్ అనంతరం మంచి డీల్ లభిస్తుందని ఆశించి ఉండవచ్చు. కానీ, సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో నిర్మాతలకు షాక్ తగిలింది. ‘‘కంగన నటించిన ‘ధాకడ్’ థియేటర్స్‌లో ఘోరపరాజయం పాలైంది. అందువల్ల ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌ను అమ్మడం ద్వారా కూడా నిర్మాతలకు మంచి ఆదాయం రాదు. చిత్రానికీ సంబంధించిన మౌత్‌టాక్ కూడా బాగాలేదు. ఇది ‘A’ రేటేడ్ సినిమా. టీవీ ప్రీమియర్ కోసం మరోసారి సర్టిఫై చేయాలి’’ అని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ధాకడ్’ ను ప్రపంచవ్యాప్తంగా ‘జీ-స్టూడియోస్’ డిస్ట్రిబ్యూట్ చేసింది. అందువల్ల ‘జీ-5’, ‘జీ-సినిమా’ డిజిటల్ రైట్స్‌ను కొంటాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, మేకర్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోకు హక్కులను అమ్మాలనే ఆలోచనలో ఉన్నారు.



Updated Date - 2022-05-27T20:38:07+05:30 IST