ఖాన్‌లు, కుమార్‌లు హీరోలుగా తెరకెక్కే సినిమాలకు నో చెప్పాను: కంగనా రనౌత్

ABN , First Publish Date - 2022-05-01T22:24:24+05:30 IST

సమకాలీన అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘ధాకడ్’. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది.

ఖాన్‌లు, కుమార్‌లు హీరోలుగా తెరకెక్కే సినిమాలకు నో చెప్పాను: కంగనా రనౌత్

సమకాలీన అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘ధాకడ్’. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. మూవీ ట్రైలర్‌ను ఈ మధ్యనే విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగన పలు అంశాలపై స్పందించింది. మహిళా ప్రాధాన్య చిత్రాల కోసం ఖాన్‌లు, కుమార్‌లు హీరోలుగా తెరకెక్కే అనేక సినిమాలకు నో చెప్పానని కంగన పేర్కొంది.


టాప్ హీరోల చిత్రాలకు నో చెప్పి పెద్ద రిస్క్ చేశానని కంగనా రనౌత్ తెలిపింది. ‘‘హీరో ప్రధానంగా తెరకెక్కే అనేక సినిమాలకు నేను నో చెప్పాను. అందువల్ల నా కెరీర్ కొంతకాలం నెమ్మదించడానికి నేను కూడా కారణం. ఖాన్‌లు, కుమార్‌లు, ఇతర పెద్ద హీరోల చిత్రాలను నేను నిరాకరించాను. ఆ సమయంలో ప్రతి ఒక్కరు నేను జీవితాన్ని వృథా చేస్తున్నట్టు చూశారు. మీకు భవిష్యత్ మీద విజన్ ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని మార్చలేరు. నా జీవితం గురించి వారెందుకు ఆలోచిస్తున్నారని నేను ఆశ్యర్య పోయేదానిని. అందరికంటే టాప్‌లో ఉండటానికి అర్హురాలినని నేను భావించేదానిని. నేను ఏ విధమైన ప్లాన్ చేసుకోనప్పటికీ, నాకు విజన్ మాత్రమే ఉండేది. మహిళా ప్రాధాన్య సినిమాలను చూడటానికి ప్రపంచం సిద్ధంగా ఉంది’’ అని కంగనా రనౌత్ తెలిపింది. 

Updated Date - 2022-05-01T22:24:24+05:30 IST