చేతనైతే బుర్ఖా వేసుకోకుండా అఫ్గానిస్థాన్‌లో తిరగండి.. కంగన వివాదాస్పద కామెంట్స్..

ABN , First Publish Date - 2022-02-11T17:25:21+05:30 IST

బాలీవుడ్‌లో ఏ విషయం గురించైన బెరుకు లేకుండా మాట్లాడే కొద్దిమందిలో కంగన రనౌత్ ఒకరు. అలా మాట్లాడే ఈ భామ కొన్నిసార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటుంది...

చేతనైతే బుర్ఖా వేసుకోకుండా అఫ్గానిస్థాన్‌లో తిరగండి.. కంగన వివాదాస్పద కామెంట్స్..

బాలీవుడ్‌లో ఏ విషయం గురించైన బెరుకు లేకుండా మాట్లాడే కొద్దిమందిలో కంగన రనౌత్ ఒకరు. అలా మాట్లాడే ఈ భామ కొన్నిసార్లు కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అందుకే ఈ బ్యూటీని సినీ జనాలు ఫైర్ బ్రాండ్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ తార మరోసారి హిజాబ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.


కర్ణాటకని రగిలిస్తున్న హిజాబ్ వివాదం గురించి అందరికి తెలిసిందే. విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావొచ్చా లేదా అనే విషయంపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిగి తీర్పు వెలువడే వరకూ హిజాబ్ కానీ, మరే ఇతర మతపరమైన దుస్తులు ధరించకూడదని కోర్టు తాత్కాలిక తీర్పు ఇచ్చింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగన స్పందించింది.


హిజాబ్ గురించి కంగన తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. అందులో.. ‘ధైర్యం చూపించాలంటే ఆఫ్ఘనిస్తాన్‌లో బురఖా ధరించకుండా చూపించండి. విముక్తి పొందడం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు పంజరంలో బంధించుకోకండి’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ స్టోరీలో విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తుల కోడ్‌లను తొలగించేందుకు మద్ధతిస్తున్న రచయిత ఆనంద్ రంగనాథన్ పోస్ట్‌ను కంగన షేర్ చేసింది.  ఆ పోస్ట్‌లో.. ‘1973లో బికినీలో ఉన్న ఇరాన్ మహిళలు, ప్రస్తుతం బుర్ఖాలో ఉన్నారు. చరిత్ర నుంచి నేర్చుకోకుండా దాన్ని పునరావృతం చేయడం విచారకరం’ అని ఆయన రాసుకొచ్చాడు.



Updated Date - 2022-02-11T17:25:21+05:30 IST