పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి Evelyn Sharma

ABN , First Publish Date - 2021-11-20T02:40:13+05:30 IST

బాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎవ్లీన్, ఆమె భర్త తుషాన్ భిండీ తమ మొదటి సంతనానికి స్వాగతం పలికారు

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి Evelyn Sharma

బాలీవుడ్ నటి ఎవ్లీన్ శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎవ్లీన్, ఆమె భర్త తుషాన్ భిండీ తమ మొదటి సంతనానికి స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ఎవ్లీన్ శర్మ సోషల్ మీడియాలో పంచుకుని తన ఆనందాన్ని తెలియజేసింది. 


ఎవ్లీన్ తన కూతురిని ముద్దు పెడుతున్న ఫొటోను  నవంబర్‌ 19న ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో కింద కామెంట్‌ను కూడా రాసింది. ‘‘ నా జీవితంలో ముఖ్యమైన పాత్రను అవభిండీకి తల్లిగా పోషించే సమయం ఆసన్నమైంది ’’ అంటూ కామెంట్‌ను రాసింది. అవ అనే పదానికి జీవితం, పక్షి, నీళ్లు, ద్వీపం అనే అర్థాలున్నాయి. ఆ పోస్టుకు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలిపారు. ‘‘ నాకు ప్రియమైన ఎవ్లీన్ శర్మకు శుభాకాంక్షలు ’’ అని బాలీవుడ్ హీరో అయిన నీల్ నితిన్ ముకేశ్ కామెంట్ చేశాడు. ‘‘ కంగ్రాచ్యులేషన్స్ ఎవ్లీన్ ’’ అంటూ సోనాల్ చౌహాన్ కూడా తన స్పందనను తెలిపింది. ఎవ్లీన్, తుషాన్ తమ కూతురు అవ భిండీ పేరు మీద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా ఓపెన్ చేశారు.




తను బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను కొద్దిరోజుల క్రితమే ఎవ్లీన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోల కింద పేరేటింగ్ సలహాలు ఇవ్వమని కోరింది. తల్లిగా జీవితాన్ని ప్రారంభించడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత, కొందరితో మాట్లాడిన తర్వాత సిద్దం కావడానికి ఏం లేదని వివరించింది.

Updated Date - 2021-11-20T02:40:13+05:30 IST