మ్యాగజైన్‌పై దీపిక కవర్ ఫొటో.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-13T15:43:38+05:30 IST

బాలీవుడ్ మంచి పాపులారిటీ, స్టార్‌డమ్ ఉన్న నటీమణుల్లో దీపికా పదుకొనే టాప్‌ ప్లేస్‌లో ఉంటారు...

మ్యాగజైన్‌పై దీపిక కవర్ ఫొటో.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ, స్టార్‌డమ్ ఉన్న నటీమణుల్లో దీపికా పదుకొనే టాప్‌ ప్లేస్‌లో ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవలే ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో‌షూట్ చేసింది. ఆ పిక్స్‌ని దీపిక సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా వైరల్‌గా మారాయి. అయితే ఈ భామ పోస్ట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం దానికి పెట్టిన క్యాప్షన్.


దీపికా ఆ పోస్ట్‌కి.. ‘రంగులు వేసుకునే వ్యక్తి నుంచి ప్రపంచంలోని ప్రముఖ మ్యాగజైన్ కవర్‌ పేజీపైకి ఎక్కేవరకూ చేరాను. దీనికి కోసం ఎంతో కష్టపడి ఎన్నో నేర్చుకున్నా. కొన్ని వదిలించుకున్నా. ఎంతో మారి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చా. ఇంత గుర్తింపు పొందే ప్రయాణంలో ఎంతో కష్టం, కృషి ఉన్నాయి’ అంటూ రాసుకొచ్చింది.


ఈ పిక్స్‌కి ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యి కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది దీపికాతో పాటు ఆమె భర్త రణ్‌వీర్ సింగ్‌ని కూడా ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఈ భామపై విమర్శులు చేస్తున్నారు. దానికి కారణం కెరీర్‌లో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ఉన్న ఈ బ్యూటీ ఓ మ్యాగజైన్ కోసం ఇంకా బాధితురాలిగా, కష్టాలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా తనని తాను చూపించుకోవడమే.


‘ఆమె తండ్రి ఓ ప్రముఖుడే. ప్రముఖ మోడల్‌గా, నటిగా, అలాగే బాలీవుడ్ స్టార్‌కి భార్యగా మంచి స్థాయిలో ఉంది. అయినప్పటికీ ఒక అంతర్జాతీయ మ్యాగజైన్ కోసం బాధితురాలిలా మాట్లాడుతోంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘ఎస్‌ఎమ్‌హెచ్ అంటే ఏంటో తెలుసుకోకుండానే వెస్టర్న్ దేశాల పద్ధతులను దీపికా ఫాలో అవుతున్నారు’ అంటూ రాసుకొచ్చారు. మరొకరైతే.. ‘దీపికాకి చికిత్స అవసరం’ అంటూ విమర్శించారు.



Updated Date - 2022-03-13T15:43:38+05:30 IST