విభిన్న కథా చిత్రాలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ (Cannes Film Festival)లో ఆమె జ్యూరీ మెంబర్‌గా పాల్గొంటుంది. సబ్యసాచి డిజైన్ చేసిన దుస్తులను ధరించి రెడ్ కార్పెట్‌పై సందడి చేసింది. ఈ వేడుకలో భాగంగా ఇండియన్ పెవిలియన్‌ను ప్రారంభించింది. బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి మాట్లాడింది.
‘కేన్స్ ఫిలిం ఫెస్టివల్’ లో తన గతాన్ని దీపికా పదుకొణె గుర్తు చేసుకుంది. 15ఏళ్ల క్రితం తన మీద ఎవరికీ నమ్మకం లేదని చెప్పింది. 15ఏళ్ల తర్వాత జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ప్రపంచలోనే గొప్ప సినిమా ఈవెంట్‌లో భాగం కావడం ఆనందంగా ఉదని వెల్లడించింది. ఈ సినీ ప్రయాణం అద్భుతంగా కొనసాగిందని..అందుకు రుణపడి ఉంటానని స్పష్టం చేసింది. భారత్ తరఫున ఈ వేడుకలో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిపింది. ‘‘ఒక దేశంగా మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. దేశం తరఫున ఈ వేడుకలో భారతీయురాలిగా పాల్గొనడం గర్వకారణం. కొన్ని భారతీయ చిత్రాలను మాత్రమే గతంలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించేవారు’’ అని దీపికా పదుకొణె స్పష్టం చేసింది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. దీపిక ప్రస్తుతం ‘పఠాన్’ (Pathaan) సినిమాలో నటిస్తుంది. షారూఖ్ ఖాన్(Shah Rukh Khan), జాన్ అబ్రహాం(John Abraham) హీరోలుగా నటిస్తున్నారు. ‘ఫైటర్’( Fighter) అనే మరో చిత్రం కూడా ఆమె కనిపించనుంది. త్వరలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-కె’ ( Project K)లో హీరోయిన్‌గా నటిస్తుంది.