బాలీవుడ్ నటికి లైంగిక వేధింపులు.. న్యాయం కావాలంటోన్న భర్త..

ABN , First Publish Date - 2022-04-11T01:56:32+05:30 IST

బాలీవుడ్ నటి అయేషా టకియాకు లైంగిక వేధింపులు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె భర్త ఫర్హద్

బాలీవుడ్ నటికి లైంగిక వేధింపులు.. న్యాయం కావాలంటోన్న భర్త..

బాలీవుడ్ నటి అయేషా టకియాకు లైంగిక వేధింపులు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె భర్త ఫర్హన్ అజ్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. గోవా ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ పోర్స్) నుంచి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎదురయ్యాయని అతడు పేర్కొన్నాడు. తన భార్యను ఓ సెక్యూరిటీ గార్డు టచ్ చేయడానికి కూడా ప్రయత్నించాడని ఆరోపించాడు.  ఈ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు ఇస్తానన్నాడు. అవసరమైతే వారిని కోర్టుకు లాగుతానని పేర్కొన్నాడు. 


అయేషా టకియా భర్త ఫర్హన్ అజ్మీ లైంగిక వేధింపుల విషయాన్ని వివరిస్తూ వరుస ట్వీట్స్ చేశాడు. ‘‘డియర్ సీఐఎస్‌ఎఫ్. గోవా నుంచి ముంబై ప్రయాణించేందుకు ‘ఇండిగో-6E6386’ విమానంలో మేం టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. ఇద్దరు సీఐఎస్ఎఫ్ ఆఫీసర్లు ఆర్‌పీ. సింగ్, ఏకే యాదవ్ నా పేరును బిగ్గరగా పిలిచారు. నా కుటుంబం నుంచి కావాలనే వారు నన్ను వేరు చేశారు. సెక్యూరిటీలోని ఓ పురుష అధికారి నా భార్యను తాకడానికి ప్రయత్నించాడు. మహిళలను టచ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అని నేను అడిగాను. దూరంగా ఉండాలని కోరాను. గొడవ జరుగుతుండటంతో మరో సెక్యూరిటీ అధికారి బహదూర్ నన్ను తనిఖీ చేయాలని వేరే వారికీ సంకేతాలిచ్చాడు. ఆ సమయంలో నాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు న్యాయం అందించాలి’’ అని ఫర్హన్ అజ్మీ పేర్కొన్నాడు.



Updated Date - 2022-04-11T01:56:32+05:30 IST