27ఏళ్ల పెద్ద హీరోతో 20ఏళ్ల యంగ్ బ్యూటీ ON-SCREEN ROMANCE... ఏజ్ గ్యాప్ గురించి ఏమందంటే...

ABN , First Publish Date - 2022-02-28T00:38:48+05:30 IST

‘మర్దానీ’, ‘దోస్త్’, ‘మర్దానీ-2’ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు

27ఏళ్ల పెద్ద హీరోతో 20ఏళ్ల యంగ్ బ్యూటీ ON-SCREEN ROMANCE... ఏజ్ గ్యాప్ గురించి ఏమందంటే...

‘మర్దానీ’, ‘దోస్త్’, ‘మర్దానీ-2’ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేక్షకులకు చేరువైన నటి అవనీత్ కౌర్. తన నటన, ఫ్యాషన్, డ్యాన్స్‌తో భారీ ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలోను ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసుకే ఉన్నత శిఖరాలను అధిరోహించింది. 


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మిస్తున్న ‘టికు వెడ్స్ షేరు’లో అవనీత్ కౌర్ నటిస్తుంది. ఈ చిత్రంలో అవనీత్ సరసన నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించనున్నాడు. తన కంటే 27 ఏళ్లు పెద్దవాడైన నవాజుద్దీన్‌తో నటించడంపై 20ఏళ్ల ఈ అమ్మడు స్పందించింది. స్త్రీ, పురుష నటుల మధ్య వయసు తారతమ్యం అనేది పెద్ద విషయం కాదని అవనీత్ చెప్పింది. వయసులో చాలా అంతరం ఉన్న నటులు గతంలోనూ పలు చిత్రాలు చేశారని ఈ బ్యూటీ తెలిపింది. వారి నటనకు ప్రశంసలు అందాయని పేర్కొంది. స్క్రిఫ్ట్ వినిపించినప్పుడు, ముందుగానే... ఈ విషయం గురించి కంగన తనకు చెప్పిందంటోంది.  


సినీ ఇండస్ట్రీలో నెట్టుకు రావాలంటే పాపులారిటీ కంటే టాలెంట్ ముఖ్యం అని స్పష్టం చేసింది.‘‘నాకు ఓ సినిమాలో అవకాశం రావడానికి మూడు నుంచి నాలుగేళ్లు పట్టింది. నేను ఆ సమయంలో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలో మీకు ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే ప్రాజెక్టు రాదు. టాలెంట్ ఉంటేనే అవకాశం వస్తుంది. ఓ చిత్రంలో నటించాలని నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులను నా నటనతో ఫిదా చేయాలనుకుంటున్నాను. నా టాలెంట్ కారణంగానే అవకాశాలు వస్తున్నాయని నేను నిరూపించాలనుకుంటున్నాను’’ అని అవనీత్ కౌర్ చెప్పింది.

Updated Date - 2022-02-28T00:38:48+05:30 IST