షాహిద్ కపూర్ తమ్ముడితో డేటింగ్ చేస్తున్న ‘లైగర్’ భామ!

ABN , First Publish Date - 2022-03-18T01:42:16+05:30 IST

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన సుందరి

షాహిద్ కపూర్ తమ్ముడితో డేటింగ్ చేస్తున్న ‘లైగర్’ భామ!

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన సుందరి అనన్య పాండే. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’ చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించింది. అనంతరం పలు చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించింది. అనన్య ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడైన ఇషాన్ ఖట్టర్‌తో అనన్య గత కొంతకాలంగా డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘కాలీ పీలీ’ చిత్రం చేస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడిందట. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది.

 

షాహిద్ బర్త్ డే బాష్ ఫిబ్రవరి 25న జరిగింది. ఈ వేడుకకు అనన్య కూడా హాజరవ్వడంతో పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా వీరి ప్రేమ విషయంపై ఇషాన్ ఖట్టర్ తల్లి మాట్లాడింది. ‘‘అనన్య మా కుటుంబంలో భాగమైపోయింది. ఇషాన్ జీవితం నుంచి ఆమెను విడదీసి చూడలేం. అతడి స్నేహితులతో కూడా ఆమె ఫ్రెండ్లీగా ఉంటుంది. షాహిద్, మీరా రాజ్‌ఫుత్‌‌కి కూడా ఆమె మంచి స్నేహితురాలు’’ అని ఇషాన్ తల్లి నీలిమా తెలిపింది. 


‘గెహ్రాయియా’ సినిమాలో అనన్య నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనను నీలిమా కొనియాడింది. గతంలో అనన్యను ఓ ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్‌పై ప్రశ్న అడగగానే అయోమయానికి లోనయింది. చివరికి సమాధానం మాత్రం ఇచ్చింది. తాను సింగిల్‌గా లేనని ఆమె చెప్పింది. అనన్య తాజాగా టాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇస్తోంది. విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2022-03-18T01:42:16+05:30 IST