రాజమౌళిపై అలియాభట్‌ నిజంగా కోపంగా ఉందా..? తాజాగా ఆమె పోస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-31T15:17:58+05:30 IST

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే...

రాజమౌళిపై అలియాభట్‌ నిజంగా కోపంగా ఉందా..? తాజాగా ఆమె పోస్ట్ ఏంటంటే..

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజు పాత్రకి ప్రియురాలు సీతగా నటించిన అలియా భట్‌కి ఈ మూవీ టీం మీద కోపంగా ఉందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అందుకే సోషల్ మీడియాలో రాజమౌళిని అనుసరించట్లేదని, ఆర్ఆర్ఆర్ పోస్టులన్నింటినీ తొలగించిందని ప్రచారం జరిగింది.


ఈ సినిమాలో అలియాకి కేవలం నాలుగు సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. ఇంతటి విజయం సాధించిన సినిమాలో తనకి కేవలం కొన్ని సీన్స్ మాత్రమే ఇవ్వడంపై గుర్రుగా ఉండడం వల్లే ఆర్ఆర్‌ఆర్ గురించి ఏం మాట్లాడట్లేదని నెట్టింట చర్చలు జరిగాయి. అయితే అందరి ఊహాగానాలకు తెరదించుతూ ఈ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఈ మూవీ హిందీ వెర్షన్ 100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నట్లు ఉంది. విడుదల తర్వాత ఈ సినిమాపై ఈ బ్యూటీ చేసిన మొదటి పోస్ట్ ఇదే కావడం ఇక్కడ విశేషం.



Updated Date - 2022-03-31T15:17:58+05:30 IST