హలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వండర్ వుమెన్‌తో కలిసి..

ABN , First Publish Date - 2022-03-08T18:03:44+05:30 IST

బాలీవుడ్‌లో అందంతో పాటు అభినయం ఉన్న నటీమణుల్లో అలియా‌భట్ ఒకరు. అందుకే ఎంతోమంది అభిమానులు..

హలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. వండర్ వుమెన్‌తో కలిసి..

బాలీవుడ్‌లో అందంతో పాటు అభినయం ఉన్న నటీమణుల్లో అలియా‌భట్ ఒకరు. అందుకే ఎంతోమంది అభిమానులు ఈ బ్యూటీ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్ఆర్’ ఈ బ్యూటీ పాన్ ఇండియా నటిగా మారిపోయింది. తాజాగా ఈ భామ హాలీవుడ్ సినిమాలో నటించనుంది. అది డీసీ మూవీ ‘వండర్ వుమెన్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గాల్ గాడెట్‌తో కలిసి నటించనుంది.


ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఆయన ట్వీట్‌లో.. ‘అలియా భట్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్‌‌తో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీలో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ గాల్ గాడెట్‌తో కలిసి పనిచేయనుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే ఈ అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌కి టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నాడు’ అని రాసుకొచ్చాడు.


అయితే, అలియా కంటే ముందే దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ ఇండస్ట్రీకి అడుగుపెట్టారు. అంతేకాకుండా ప్రముఖ సౌతిండియన్ నటి సమంత కూడా అక్కడ ఓ మూవీ చేస్తోంది. వీరిలో ప్రియాంక మాత్రం అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కాగా.. ఈ మూవీతో అలియా కూడా గ్లోబల్ నటిగా మారనుంది.



Updated Date - 2022-03-08T18:03:44+05:30 IST