మరెన్నో ఇటువంటి రోజులు రావాలంటూ.. మెహందీ ఫొటోలను షేర్ చేసిన alia bhatt

ABN , First Publish Date - 2022-04-16T20:41:50+05:30 IST

సెలబ్రిటీ లవర్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాంద్రాలోని బహుళ అంతస్తుల భవనం ‘వాస్తు’లో‌ వీరి వివాహం వైభవంగా జరిగింది.

మరెన్నో ఇటువంటి రోజులు రావాలంటూ.. మెహందీ ఫొటోలను షేర్ చేసిన alia bhatt

సెలబ్రిటీ లవర్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాంద్రాలోని బహుళ అంతస్తుల భవనం ‘వాస్తు’లో‌ వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ఏప్రిల్ 13నే మెహందీ ఫంక్షన్ జరిగింది. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆలియా తాజాగా సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది. ఓ మెసేజ్‌ను కూడా షేర్ చేసింది. 


మెహందీ వేడుక ఓ కలలా జరిగిందని ఆలియా భట్ చెప్పింది. ‘‘కుటుంబం, సన్నిహిత మిత్రుల మధ్య ఈ రోజు అద్భుతంగా గడిచింది. అబ్బాయి తరఫు వారు సర్‌ప్రైజ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ డీజే ప్లే చేశాడు. నాకెంతో ఇష్టమైన రణ్‌బీర్ కపూర్ నా పాటలకు డ్యాన్స్ చేశాడు. ఫలితంగా ఆనందభాష్పాలు వచ్చేశాయి. నా జీవితంలో కొన్ని మధురానుభూతులు మిగిలాయి. మరెన్నో ఇటువంటి రోజులు రావాలి’’ అని ఆలియా భట్ తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే బాలీవుడ్ సెలబ్రిటీలు కొత్త జంటపై అభినందల వర్షం కురిపించారు. ‘వండర్ ఉమెన్’ గాల్ గడోట్ కూడా రిప్లై ఇచ్చింది.



Updated Date - 2022-04-16T20:41:50+05:30 IST