డిఫరెంట్ లుక్‌లో Alia Bhatt.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-02-15T19:25:42+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. అయితే కొన్నిసార్లు ఆ ఫ్యాషన్ పెద్ద డిజాస్టర్‌ అవుతూ ఉంటుంది...

డిఫరెంట్ లుక్‌లో Alia Bhatt.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

బాలీవుడ్‌లో మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. అయితే కొన్నిసార్లు ఆ ఫ్యాషన్ పెద్ద డిజాస్టర్‌ అవుతూ ఉంటుంది. దీంతో  కొందరు నెటిజన్లు ఈ బ్యూటీని ట్రోలింగ్‌ కూడా చేస్తుంటారు. ఈ భామ గతంలో చాలాసార్లు ఇలాంటివి ఎక్స్‌పిరీయన్స్ చేయగా.. మరోసారి అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.


అలియా నటించిన తాజా చిత్రం ‘గంగుభాయ్ కతియావాడి’. టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా త్వరలో బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పదర్శితం కానుంది. ఈ తరుణంలో బ్యూటీ ఫిబ్రవరి 14న బెర్లిన్‌కి  వెళ్లింది. దానికి కంటే ముందు ఈ భామ ముంబైలోని ఓ సెలూన్ దగ్గర మీడియా కంటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ కాగా వైరల్‌గా మారింది.


ఇందులో సెలూన్‌ నుంచి బయటికి వచ్చిన అలియా మీడియాతో ఏం మాట్లాడకుండా కారులో వెళ్లిపోయింది. ఆ సమయంలో ఈ బ్యూటీ సింపుల్ కో ఆర్డ్ డ్రెస్‌లో ఉంది. అది నైట్ డ్రెస్‌ని పోలి ఉండడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘నైట్‌డ్రెస్‌ని మార్చుకోవడం మర్చిపోయావా’ అంటూ కొందరు.. ‘నైట్‌డ్రెస్‌లోనే ఎయిర్‌పోర్ట్‌కి వెళుతున్నావా’ అని మరికొందరు కామెంట్స్ పెట్టారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-02-15T19:25:42+05:30 IST