Aishwarya Rai కు ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? రెమ్యూనరేషన్ నుంచి ఆమెకు ఉన్న కార్ల వరకు..

ABN , First Publish Date - 2022-05-24T18:01:03+05:30 IST

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ ఒకరు. మిస్ వరల్డ్ 1994 పోటీలో విజేతగా నిలిచి కిరీటాన్ని..

Aishwarya Rai కు ఎన్ని వందల కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? రెమ్యూనరేషన్ నుంచి ఆమెకు ఉన్న కార్ల వరకు..

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ ఒకరు. మిస్ వరల్డ్ (Miss World) 1994 పోటీలో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ తార అనంతరం సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఐష్ పద్మశ్రీ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించినప్పటికీ తమిళ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘జీన్స్’, ‘రోబో’ వంటి సినిమాలతో అందంతోపాటు అభినయంతో దక్షిణాదిన సైతం మంచి పాపులారిటీ సంపాదించింది. నటుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan)తో పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన ఈ బ్యూటీ తాజాగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొని తన అందంతో అందరినీ కట్టిపడేసింది. అయితే దశాబ్దానికి పైగా సినీరంగంలో నటిగా కొనసాగిన ఈ భామ సంపాదించిన ఆస్తుల గురించి తెలుసుకుందాం.. 


బాలీవుడ్‌లోని అత్యంత విలువైన నటీమణుల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒకరు. నివేదికల ప్రకారం.. ఈ భామకి ఆస్తుల నికర విలువ దాదాపు 100 మిలియన్ డాల్లర్లు అంటే భారతీయ కరెన్సీలో  రూ.776 కోట్లకి పైమాటే. అంతేకాకుండా ఈ బ్యూటీకి ఎన్నో విలువైన స్థిరాస్తులు సైతం ఉన్నాయి. ఈ తార తన భర్త, నటుడు అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి ముంబైలోని ‘జల్సా’ అనే బంగ్లాలో నివసిస్తోంది. ప్రస్తుతం ఆ ఇంటి విలువ దాదాపు రూ.112 కోట్లు. అంతేకాకుండా ఈ తారకి దుబాయ్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విల్లా కూడా ఉంది. అలాగే బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వద్ద ఉన్న హై-ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ బ్యూటీకి రూ.21 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది.


బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఐశ్వర రాయ్ ఖచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 12 కోట్లు తీసుకుంది. అంతేకాకుండా ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రమోట్ చేయడం ద్వారా ఏడాదికి రూ.80 నుంచి 90 కోట్లు సంపాదిస్తుంది. అంతేకాకుండా.. ఐశ్వర్య వద్ద విలువైన కార్లు చాలా ఉన్నాయి. ఈ బ్యూటీ వద్ద రూ.7.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.1.60 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్350డి కూపే, రూ. 1.58 కోట్ల విలువైన ఆడి ఎ8ఎల్, రూ.2.33 కోట్ల విలువైన లెక్సస్ ఎల్‌ఎక్స్ 570, రూ.1.98 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీయస్ కార్లు ఉన్నాయి.

Updated Date - 2022-05-24T18:01:03+05:30 IST