Bollywood: ఒకే రోజు గాయపడిన ఇద్దరు హీరోయిన్స్

ABN , First Publish Date - 2022-08-11T01:21:11+05:30 IST

టాలీవుడ్‌తో పాటు కొలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లోను మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి టబు (Tabu). ‘దే దే ప్యార్ దే’, ‘అల వైకుంఠపురంలో’, ‘భూల్ బూలయ్యా-2’ చిత్రాలతో ప్రేక్షకులను

Bollywood: ఒకే రోజు గాయపడిన ఇద్దరు హీరోయిన్స్

టాలీవుడ్‌తో పాటు కొలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్‌లోను మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి టబు (Tabu). ‘దే దే ప్యార్ దే’, ‘అల వైకుంఠపురంలో’, ‘భూల్ బూలయ్యా-2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘ఖైదీ’ రీమేక్ ‘భోలా’ (Bholaa) లో నటిస్తుంది. అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ మూవీ సెట్‌లో తాజాగా టబు గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆమెకు గాయమైనట్టు చిత్ర బృందం పేర్కొంది. సంబంధిత వర్గాల కథనాల ప్రకారం..సినిమా సన్నివేశాల్లో భాగంగా టబు ఓ ట్రక్‌లో ప్రయాణిస్తుంది. ఆ ట్రక్‌ను మోటారు సైకిళ్లతో కొంత మంది వెంబడిస్తున్నారు. ఓ బైక్ అదుపు తప్పి ట్రక్‌ను డీ కొట్టింది. ఆ సమయంలో ట్రక్ గ్లాస్ ముక్కలు విరిగి టబు మీద పడ్డాయి. ఆ సమయంలో కుడి కన్ను మీది భాగానికి గాయమయింది. ఆమెకు ఎటువంటి కుట్లు పడలేదని సమాచారం.


టబు గాయపడినట్టుగానే మరో నటి శిల్పా శెట్టికీ (shilpa shetty)కూడా సినిమా సెట్లో గాయమైంది. ఓ వెబ్ సిరీస్‌లో భాగంగా శిల్పాపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆమె కాలు విరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను శిల్పా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. త్వరలోనే తిరిగొస్తానని శిల్పా కామెంట్ చేసింది.



Updated Date - 2022-08-11T01:21:11+05:30 IST