Akshay Kumar to Anupam Kher: ఉపాధ్యాయులుగా పని చేసి.. నటులుగా మారిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..

ABN , First Publish Date - 2022-09-05T18:51:15+05:30 IST

సినీ పరిశ్రమలో స్థిరపడాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల వేరే రంగంలో పని చేసి..

Akshay Kumar to Anupam Kher: ఉపాధ్యాయులుగా పని చేసి.. నటులుగా మారిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..

సినీ పరిశ్రమలో స్థిరపడాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆర్థిక లేదా ఇతర కారణాల వల్ల వేరే రంగంలో పని చేసి.. సినిమాలపై ఆసక్తి చంపుకోలేక అనంతరం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్లు ఉంటారు. అలా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా ఇతర రంగాల్లో పని చేసి బాలీవుడ్‌లో పాగా వేసిన వారు ఉన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం.. ఈ సందర్భంగా టీచర్లుగా పని చేసి బాలీవుడ్‌లో చక్రం తిప్పిన పలువురు నటుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


అక్షయ్ కుమార్ (Akshay Kumar):

బాలీవుడ్ ఖిలాడీగా ప్రసిద్ధి చెందిన నటుడు అక్షయ్ కుమార్. ఆయన అస్సలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. ఈ నటుడు పాఠశాల దశలోనే చదువు మానేసి ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల మార్షల్ ఆర్ట్స్‌ని నేర్చుకున్నారు. అనంతరం ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చేసి మార్షల్ ఆర్ట్స్ ఉపాధ్యాయుడిగా చేరారు. ఆయన విద్యార్థుల్లో ఓ విద్యార్థి సూచన మేరకు మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. అనంతరం నటుడిగా మారి బాలీవుడ్ స్టార్స్‌లో ఒకరిగా ఎదిగారు.


అనుపమ్ ఖేర్ (Anupam Kher):

‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తీకేయ 2’తో బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అనుపమ్ ఖేర్. అయితే.. ఈ నటుడికి సొంతంగా ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. అందులో ఇప్పటికీ నటనకి సంబంధించిన తరగతులను విద్యార్థులకు భోధిస్తూ ఉంటారు. సినిమాలపై, నటనపై ఆయనకి ఉన్న అవగాహనకి పలుమార్లు ఆయన విద్యార్థులే ఆశ్చర్యపోయేవారంట. ఆయన శిష్యుల్లో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు. అందులో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వెలుగొందుతున్న దీపకా పదుకొనే ఒకరు.



బల్‌రాజ్ సాహ్ని (Balraj Sahni):

‘దో బిఘా జమీన్’, ‘అనురాధ’, ‘కాబూలీవాలా’ వంటి కొన్ని ఎవర్‌గ్రీన్ సినిమాలతో గుర్తింపు పొందిన నటుడు బల్‌రాజ్ సాహ్ని. ఈ నటుడు ఇంగ్లిష్, హిందీలో పండితుడు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ మొదలు పెట్టకముందు ప్రతిష్టాత్మక విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.


టామ్ ఆల్టర్ (Tom Alter):

అద్భుతమైన నటనతో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన అమెరికన్ సంతతి నటుడు టామ్ ఆల్టర్. ఈయన సెయింట్ థామస్ స్కూల్, జగాద్రి (హర్యానా)లో క్రికెట్ కోచ్‌గా పనిచేసేవారు. అనంతరం ‘శక్తిమాన్’, ‘శత్రంజ్ కే ఖిలాడి’, ‘ఆషికి’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.


ఉత్పల్ దత్ (Utpal Dutt):

‘షౌకీన్’ ‘రంగ్ బిరంగి’, ‘నరమ్ గరం’ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించిన ప్రముఖ బెంగాలీ నటుడు ఉత్పల్ దత్. కోల్‌కతాలోని సౌత్ పాయింట్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశారు.


ఖాదర్ ఖాన్ (Kader Khan): 

నటుడు, స్క్రీన్ రైటర్, హాస్యనటుడు, దర్శకుడి పలు నైపుణ్యాలు ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీ ఖాదర్ ఖాన్. 1970-75 సంవత్సరంలో ఎం.హెచ్.సబూ సిద్ధిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో ఫ్రొఫెసర్‌గా పని చేశారు.


నందితా దాస్ (Nandita Das):

ఫైర్, ఎర్త్, బావందర్, కన్నతిల్ ముత్తమిట్టల్, అళగి, కమ్లి, బిఫోర్ ది రెయిన్స్ వంటి పలు భాష చిత్రాలతో గుర్తింపు పొందిన నటి నందితా దాస్. ఈ నటి సినిమాల్లోకి రాకముందు రిషి వ్యాలీ స్కూల్‌‌కి ఓ డైరెక్టర్‌గా ఉండేవారు. అక్కడే ఉపాధ్యాయురాలిగా కూడా పని చేశారు.


చంద్రచూర్ సింగ్ (Chandrachur Singh):

జోష్, మాచిస్, దాగ్ వంటి సినిమాలతో పాపులారిటీ సాధించిన నటుడు చంద్రచూర్ సింగ్. ఆయన నటుడిగా మారకముందు ఓ ప్రముఖ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా పని చేశారు.


కన్వర్జిత్ పెంటల్ (Kanwarjit Paintal):

కాలో, సత్తె పె సత్తా, బావర్చి, రుఫూ చక్కర్ వంటి చిత్రాలతో ఫేమ్ సాధించిన నటుడు కన్వర్జిత్ పెంటల్. ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో ప్రావీణ్యం సాధించి హాస్య నటుడిగా మారారు. అయితే.. నటుడిగా మారాకముందు ఆ ఇన్‌స్టిట్యూట్‌కి హెడ్‌గా పని చేశారు.


బాబ్ క్రిస్టో (Bob Christo):

మిస్టర్ ఇండియా, గుమ్రా, మర్ద్, అబ్దుల్లా మొదలైన చిత్రాలతో ప్రసిద్ధి చెందిన నటుడు ఒక ఆస్ట్రేలియన్ భారతీయ నటుడు బాబ్ క్రిస్టో. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చే ముందు యోగా శిక్షకుడిగా పని చేశారు.

Updated Date - 2022-09-05T18:51:15+05:30 IST