Akshay Kumar to Alia Bhatt: భారత పౌరసత్వం లేని బాలీవుడ్ స్టార్స్ వీళ్లే..

ABN , First Publish Date - 2022-08-28T19:12:17+05:30 IST

నటన అంటే ఒక కళ. కళకి ఏది అడ్డుకాదు. అందుకే వివిధ దేశాల చెందిన నటులు ఇతర దేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంటారు...

Akshay Kumar to Alia Bhatt: భారత పౌరసత్వం లేని బాలీవుడ్ స్టార్స్ వీళ్లే..

నటన అంటే ఒక కళ. కళకి ఏది అడ్డుకాదు. అందుకే వివిధ దేశాల చెందిన నటులు ఇతర దేశాల్లోనూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంటారు. అమెరికాలోని హాలీవుడ్ పరిశ్రమలో వేరే దేశాల నటులు కూడా యాక్ట్ చేస్తూ స్టార్స్‌గా వెలుగొందడం మనం ఇప్పటికే చూశాం. అంతేకాకుండా.. మన దేశంలోని చిత్రపరిశ్రమల్లోనూ అలాంటి వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో అలాంటి వారు చాలామంది ఉన్నారు. అందులో కొందరూ భారతీయులే అయినప్పటికీ వారికీ భారత పౌరసత్వం లేకపోవడం విశేషం. అలా భారత పౌరసత్వం లేకుండా బాలీవుడ్ స్టార్స్‌గా వెలుగొందుతున్నవారి గురించి తెలుసుకుందాం..


అక్షయ్ కుమార్ (Akshay Kumar)..

బాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరిగా స్టార్‌డమ్ అనుభవిస్తున్న నటుడు అక్షయ్ కుమార్. ఈ యాక్టర్ పుట్టింది.. పెరిగింది.. భారతదేశంలోనే.. అయినప్పటికీ అక్షయ్‌కి భారత పౌరసత్వం లేదు. గత కొన్నేళ్ల క్రితం కెనడా పౌరసత్వం కోసం అక్షయ్ ఇండియన్ సిటిజన్‌షిప్‌ని వదులుకున్నాడు.


అలియా భట్ (Alia Bhatt)..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా ఉంటూ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆలియాభట్ ఒకరు. ఈ బ్యూటీకి దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీ టౌన్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే.. అలియా పుట్టింది ఇండియాలో కాదు.. లండన్‌లో.. అందుకే ఈ భామకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది.


కత్రినా కైఫ్ (Katrina Kaif)..

వరుసగా బాలీవుడ్ స్టార్స్‌తో సినిమాలు చేస్తూ దాదాపు రెండు దశాబ్దాలుగా బీ టౌన్‌లో అగ్రతారగా కొనసాగుతున్న నటి కత్రినా కైఫ్. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఈ భామ కూడా ఉంటుంది. ఇటీవలే బాలీవుడ్ యువ నటుడు విక్కీ కౌశల్‌ని వివాహం చేసుకుని జీవితంలో మరో అడుగువేసింది. అయితే.. నిజానికి కత్రినా హాంకాంగ్ జన్మించింది. ఆమె కుటుంబం యూకే‌లో సెటిల్ అవ్వడం వల్ల కత్రినాకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది.


జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)..

‘అలాదిన్’ అనే సినిమాతో 2009లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బీ టౌన్‌కి ఎంట్టీ ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే.. జాక్వెలిన్‌కి శ్రీలంక పౌరసత్వం ఉంది. అయితే.. ఈ బ్యూటీ బహ్రెయిన్‌లో పెరగడం విశేషం. అందుకే ఈ బ్యూటీకి భారత పౌరసత్వం ఇవ్వలేదు. వీరు మాత్రమే కాకుండా.. మరికొందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం భారత పౌరసత్వం లేని నటులు బాలీవుడ్‌లో ఉన్నారు.


అయితే.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వ్యక్తులకి ఒకటికి మించిన దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం.. కొన్ని షరతులకి లోబడి ఆ దేశాల సిటిజన్‌షిప్‌ని ఇతర దేశాల పౌరులకి ఇవ్వడమే. అయితే.. భారతదేశం మాత్రం దానికి ఒప్పుకోదు. ఒకవేళ ఎవరైనా భారతీయులు ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటే.. ఇక్కడ వారికి ఉన్న పౌరసత్వం రద్దు అవుతుంది.









Updated Date - 2022-08-28T19:12:17+05:30 IST