13 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్ వీడియో షేర్ చేసిన విక్కీ కౌశల్.. ఎలా ఉన్నాడో చూశారా..

ABN , First Publish Date - 2022-01-18T16:15:30+05:30 IST

పాకిస్తాన్‌పై ఇండియా చేసిన సర్జికల్ స్ర్టైక్ ఆధారంగా వచ్చిన ‘ఉరి’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన నటుడు విక్కీ కౌశల్.

13 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్ వీడియో షేర్ చేసిన విక్కీ కౌశల్.. ఎలా ఉన్నాడో చూశారా..

పాకిస్తాన్‌పై ఇండియా చేసిన సర్జికల్ స్ర్టైక్ ఆధారంగా వచ్చిన ‘ఉరి’ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన నటుడు విక్కీ కౌశల్. అనంతరం కూడా మంచి సినిమాలు చేస్తూ స్టార్‌డమ్‌ని ఇంకా పెంచుకున్నాడు.


అయితే విక్కీ తండ్రీ శ్యామ్ కౌశల్ కూడా బాలీవుడ్ స్టంట్ మాస్టర్‌గా మంచి పేరునే సంపాదించుకున్నాడు. అయినప్పటికీ ఈ యువ నటుడు డెడీకేషన్, టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. తాజాగా టాలెంటెడ్ నటుడు 13 క్రితం నటనలో శిక్షణ తీసుకున్నప్పటీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


విక్కీ సహ విద్యార్థిని, ‘హే హై మెహబతియాన్’ షో ఫేమ్ షేరిన్ మీర్జా ఈ వీడియోను పోస్ట్ చేయాగా.. దాన్ని ఈ నటుడు రీ పోస్ట్ చేశాడు. అందులో వీరిద్దరూ ఓ ఫన్నీగా సీన్‌ని నటించి చూపించారు. ఆ ఫన్నీ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2022-01-18T16:15:30+05:30 IST