ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించాలి: సోనూ సూద్

ABN , First Publish Date - 2022-02-26T01:22:53+05:30 IST

రష్యా భద్రతా దళాలు ఉక్రెయిన్‌‌తో యుద్ధం చేస్తున్న

ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా తరలించాలి: సోనూ సూద్

రష్యా భద్రతా దళాలు ఉక్రెయిన్‌‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం అతలాకుతలమైంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకరాజ్యసమితి, నాటో దేశాలు కలగజేసుకుని ఉద్రిక్తతలను చల్లబర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ యుద్ధంతో ఉక్రెయిన్‌లోని భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఘటనపై సోనూ సూద్  స్పందించాడు.


ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని సోనూ‌సూద్ ప్రభుత్వాన్ని కోరాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘దాదాపుగా 18వేల మంది భారతీయ విద్యార్థులు, పలు కుటుంబాలు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాయి. వారందరిని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. భారతీయులందరిని తరలించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు.   


ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ భారతీయులు భద్రతను కోరుతూ ఓ ప్రకటనను వెలువరించింది. భారతీయులు, విద్యార్థులు ఎల్లప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లను తమ వెంట ఉంచుకోవాలని సూచించింది. ఇళ్లను వదిలి రావొద్దని చెప్పింది.




Updated Date - 2022-02-26T01:22:53+05:30 IST