రోడ్డు పక్కన సమోసాలు తిన్న సోనూ సూద్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-08T20:54:41+05:30 IST

కరోనా కాలంలో అవసరమైన వారికి సహాయం అందించి ప్రజల మన్ననలు పొందిన నటుడు సోనూ సూద్

రోడ్డు పక్కన సమోసాలు తిన్న సోనూ సూద్.. కారణం ఏంటంటే..


కరోనా కాలంలో అవసరమైన వారికి  సహాయం అందించి ప్రజల మన్ననలు పొందిన నటుడు సోనూ సూద్. హిందీ రియాలిటీ షో ‘రోడీస్’ను అతడు హోస్ట్‌ చేయనున్నాడు. ‘రోడీస్’ కొత్త సీజన్‌ను సౌతాఫ్రికాలో షూట్ చేయనున్నారు. ఈ రియాలిటీ షోకు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ సోనూ సూద్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన  సమోసాలు కూడా తిన్నాడు. 


అయితే, ఈ కొత్త ‘రోడీస్’ సీజన్ అద్భుతంగా ఉంటుందని సోనూ సూద్ తెలిపాడు. సౌతాఫ్రికాకు వెళ్లే ముందు కొన్ని సమోసాలు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఆ దేశంలో చాట్ సమోసా దొరకొచ్చు లేదా దొరకకపోవచ్చు అని స్పష్టం చేశాడు. అనంతరం సమోసాలు అమ్మే వ్యక్తితో కూడా మాట్లాడాడు. సౌతాఫ్రికాకు రావడం ఇష్టమేనా అని అడిగాడు. అందుకు అతడు వస్తానని సమాధానమిచ్చాడు. ‘రోడీస్’ లో పాల్గొనే వారికి ఆ దేశంలో సమోసాలు కూడా లభిస్తాయి. కొత్త సీజన్ కోసం సిద్ధంగా ఉండండి అని వెల్లడించాడు. 


‘రోడీస్’ను సౌతాఫ్రికాలో ఫిబ్రవరి రెండో వారం నుంచి షూట్ చేయనున్నారు. టీవీలో ఈ షో మార్చి నుంచి ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. ఈ షోను గతంలో రణ్‌విజయ్ సింఘ హోస్ట్ చేసేవాడు.



Updated Date - 2022-02-08T20:54:41+05:30 IST