ప్రేమా లేక లక్ష్యమా తేల్చుకోమన్న ప్రియురాలు.. యంగ్ హీరో ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-02-28T17:07:10+05:30 IST

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన ‘గల్లీబాయ్’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు సిద్ధాంత్ చతుర్వేది...

ప్రేమా లేక లక్ష్యమా తేల్చుకోమన్న ప్రియురాలు.. యంగ్ హీరో ఏం చేశాడంటే..

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా చేసిన ‘గల్లీబాయ్’ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ఈ యువ నటుడు తాజాగా దీపికా పదుకొనే, అనన్య పాండేలతో కలిసి ‘గెహ్రాయాన్’ అనే చిత్రంలో నటించాడు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా సిద్ధాంత్ ఓ ఇంటర్య్వూలో సినీ కెరీర్‌కి ముందు విఫల ప్రేమ గురించి తెలిపాడు


సిద్ధాంత్ మాట్లాడుతూ.. ‘నాకు 20 ఏళ్ల వయసులో నాకేం కావాలో స్పష్టత వచ్చింది. ఆ కారణంతో పెద్ద హార్ట్‌బ్రేక్ సైతం వచ్చింది. అప్పటికీ నేను ఓ అమ్మాయితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాను. తనని పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకున్నాను. దానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు వేసుకున్నాను.


అయితే తను సాధారణ జీవితాన్ని కోరుకుంది. నేను ఆ సమయంలో సీఏ చేస్తున్నాను. కానీ సినిమాల మీద ఇంట్రస్ట్ పెరగడంతో నా కెరీర్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అది తనకు నచ్చలేదు. మేము జీవితంలో రెండు విభిన్న ఆలోచనలను కలిగి ఉన్నాం. అందుకే తను నన్ను ప్రేమ కావాలో, లక్ష్యం కావాలో తేల్చుకోమని చెప్పింది. నేను సినిమాలనే ఎంచుకున్నాను. అప్పుడు అది ఎంతో బాధగా అనిపించింది. ఆ విఫల ప్రేమ నన్ను ఎంతో మార్చింది. నాలో పట్టుదలని పెచ్చింది. ఆ సమయంలో ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటానని తనకి చెప్పాను. ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-02-28T17:07:10+05:30 IST