ఆలస్యం అయ్యింది..తేదీని మాత్రం తప్పక గుర్తుంచుకోండి: షారూఖ్ ఖాన్

ABN , First Publish Date - 2022-03-02T23:18:03+05:30 IST

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయింది

ఆలస్యం అయ్యింది..తేదీని మాత్రం తప్పక గుర్తుంచుకోండి: షారూఖ్ ఖాన్

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయింది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జీరో’ పరాజయం తర్వాత చాలా కాలం విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం కింగ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పఠాన్’. జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.  


బాలీవుడ్ బాద్ షా తాజాగా ఈ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘‘ఆలస్యం అయ్యిందని నాకు తెలుసు. కానీ, తేదీని మాత్రం తప్పక గుర్తుంచుకోండి. ‘పఠాన్’ సమయం మొదలైంది. థియేటర్ల‌ల్లో కలుసుకుందాం’’ అని షారూక్ రాశాడు. థియేటర్లల్లో ఈ చిత్రం జనవరి 25, 2023 నుంచి సందడి చేయనుంది. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. ఇందులో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవనున్నాడు.



Updated Date - 2022-03-02T23:18:03+05:30 IST