ఘనంగా షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ వివాహం

ABN , First Publish Date - 2022-03-03T22:24:42+05:30 IST

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్

ఘనంగా షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ వివాహం

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ వివాహం తాజాగా జరిగింది. మయాంక్ అనే వ్యక్తిని  బుధవారం ఆమె పెళ్లాడింది. సనా వివాహాం మహాబలేశ్వర్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సనా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆమె ఈ పిక్స్‌ను షేర్ చేసిన కాసేపటికే నెట్టింట వైరల్‌గా మారాయి. షాహిద్ అభిమానులు కూడా విపరీతంగా ఈ ఫొటోలను షేర్ చేయడం మొదలుపెట్టారు. కొత్త ఫొటోల్లో నవదంపతులు చూడముచ్చటగా కనిపించారు.  షాహిద్ భార్య మీరా కపూర్ కూడా తన సోషల్ మీడియాలో ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. షాహిద్ హీరోగా తెరకెక్కిన ‘షాన్‌దార్’ చిత్రంలో సనా కపూర్ కూడా నటించింది. 


షాహిద్ కపూర్ ఈ మధ్యనే పుట్టిన రోజు జరుపుకొన్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా అతడు విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్-580 కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారు 500హార్స్ పవర్ ట్విన్ టర్బో ఇంజిన్లతో పనిచేస్తుంది. చాక్లెట్ బాయ్ తన భార్య మీరా రాజ్‌పుత్‌తో కలసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్న పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేశాయి. దీంతో అతడి అభిమానులు కారు ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. చివరకు దాని ధర తెలుసుకుని షాకయ్యారు. అతడు కొన్న కారు ధర దాదాపుగా రూ.2.79కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 



Updated Date - 2022-03-03T22:24:42+05:30 IST