‘జెర్సీ’ సినిమా కథ నాదే.. కోర్టు మెట్లెక్కిన రచయిత..!

ABN , First Publish Date - 2022-04-13T21:16:35+05:30 IST

షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా వివాదంలో చిక్కుకుంది. కాపీరైట్ సమస్యలను ఎదుర్కోంటుంది.

‘జెర్సీ’ సినిమా కథ నాదే.. కోర్టు మెట్లెక్కిన రచయిత..!

షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా వివాదంలో చిక్కుకుంది. కాపీరైట్ సమస్యలను ఎదుర్కోంటుంది. రూపేశ్ జైస్వాల్ అనే రచయిత ఈ కథ తనదంటూ కోర్టు మెట్లెక్కాడు. వివరాల్లోకి వెళ్లితే..


ఈ స్క్రిఫ్ట్‌ను 2007లోనే ‘ఫిలిం రైటర్ అసోసియేషన్‌’లో ‘ది వాల్’ పేరుతో రిజిస్టర్ చేశానని రూపేశ్ జైస్వాల్ తెలిపాడు. ప్రస్తుతం ఈ అసోసియేషన్‌ను ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్’ అని పిలుస్తున్నారని చెప్పాడు. ఈ కథ, కాన్సెఫ్ట్‌ను అక్రమ పద్ధతుల్లో ప్రతివాదులు సంపాదించారని వివరించాడు. తెలుగు, హిందీలో ‘జెర్సీ’ పేరుతో నిర్మించారని ఆరోపించాడు. తన కథ పూర్తిగా ఓ యువకుడి చుట్టూ క్రికెట్, కుటుంబ అనుబంధాల నేపథ్యంగా కొనసాగుతుందని వెల్లడించాడు. కథ, స్క్రిఫ్ట్‌లో తనకు తెలియకుండా ఎన్నో మార్పులు చేసి నిర్మించారన్నాడు. ‘నాకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ, ప్రతివాదులు అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్నారు’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాడు.  


తెలుగులో ‘జెర్సీ’ సినిమాను 2019లో నిర్మించారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. టాలీవుడ్‌లో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేశారు. ఏప్రిల్ 14న ఈ మూవీ థియేటర్స్‌లోకి రావాల్సి ఉండగా, యశ్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ -2’ కారణంగా ఏప్రిల్ 22కు వాయిదా పడింది.

Updated Date - 2022-04-13T21:16:35+05:30 IST