Bollywood vs South Cinema.. సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు.. KGF 2 లో నటించడంపై కూడా..

ABN , First Publish Date - 2022-04-04T20:48:35+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన

Bollywood vs South Cinema.. సంజయ్ దత్ కీలక వ్యాఖ్యలు.. KGF 2 లో నటించడంపై కూడా..

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ‘కేజీఎఫ్ చాప్టర్-2’ పేరుతో తెరకెక్కింది. పాన్ ఇండియాగా ఈ మూవీ రూపొందింది. హిందీతో సహా పలు భాషల్లో ‘చాప్టర్-2’ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.


‘కేజీఎఫ్: చాప్టర్-2’లో అవకాశం రావడం సంతోషకరం అని సంజయ్ దత్ చెప్పాడు. గతంలోను ఇటువంటి నేరపూరితమైన పాత్రలను పోషించానని తెలిపాడు. తనొక నటుడినని, చనిపోయేంతవరకు నటిస్తూనే ఉంటానని వెల్లడించాడు. రొమాన్స్ ఇష్టమైనప్పటికీ ఈ చిత్రంలో అందుకు అవకాశం రాలేదని నవ్వూతూ వివరించాడు. రవీనా టండన్ అద్భుతంగా నటిస్తుందని ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ 2018లో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ నేపథ్యంలో సీక్వెల్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Updated Date - 2022-04-04T20:48:35+05:30 IST