బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి పాము కాటు

ABN , First Publish Date - 2021-12-26T18:25:08+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 25) పాము కాటుకు గురయ్యాడు. గతరాత్రి పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండగా ఘటన జరినట్లు సమాచారం...

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి పాము కాటు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ శనివారం (డిసెంబర్ 25) పాము కాటుకు గురయ్యాడు. గతరాత్రి పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో ఉండగా ఘటన జరినట్లు సమాచారం. దీని తర్వాత నటుడిని అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో దగ్గరలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లగా.. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఉదయం 9 గంటలకు ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చిన ఈ కండల వీరుడి ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.


సమాచారం ప్రకారం.. క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 27న బర్త్ డే పార్టీ జరుపుకునేందుకు సల్మాన్, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫామ్‌హౌస్‌కి చేరుకున్నాడు. అయితే ఆ ప్రాంతం చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం ఉండడంతో తరచుగా ఈ కాంప్లెక్స్‌లోకి పాములు, కొండచిలువలు వస్తుంటాయి. సరదాగా బయటి ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తెలియవస్తోంది. కానీ ఆ పాము విషరహితం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ 56వ పుట్టిన రోజుకి రెండు రోజుల ముందు ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు ఈ స్టార్ ఫ్యాన్స్.

Updated Date - 2021-12-26T18:25:08+05:30 IST