మొదటిసారి సోలోగా సల్మాన్ ఖాన్ పెయింటింగ్స్ ప్రదర్శన.. స్టార్ హీరో ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-03-04T21:19:44+05:30 IST

బాలీవుడ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అందుకే ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో అదరగొట్టే..

మొదటిసారి సోలోగా సల్మాన్ ఖాన్ పెయింటింగ్స్ ప్రదర్శన.. స్టార్ హీరో ఏమన్నాడంటే..

బాలీవుడ్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. అందుకే ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో అదరగొట్టే ఈ స్టార్ హీరో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానుల ఎదురుచూస్తుంటారు. అయితే సల్లుభాయ్‌లో నటనతోపాటు మరో టాలెంట్ కూడా ఉంది. అదే పెయింటింగ్.


సల్మాన్ ఇప్పటికే ఎన్నోసార్లు ఈ టాలెంట్‌ని నిరూపించుకున్నాడు. ఆయన పెయింటింగ్స్‌ను ప్రదర్శనకి సైతం ఉంచాడు. అయితే ఇప్పటికే తాను వేసిన చాలా పెయింటింగ్స్ ను ఇతర ఆర్టిస్టుల పెయింటింగ్స్‌తో పాటు ప్రదర్శించగా.. తాజాగా మరికొన్నింటిని సోలోగా ఎగ్జిబిషన్‌లో పెట్టనున్నారు. 


ఈ ప్రదర్శనను ‘మదర్‌హుడ్ - యాన్ ఆర్టిస్టిక్ ఓడ్ టు మదర్ థెరిసా’ పేరుతో సందీప్, గీతాంజలి మైని ఫౌండేషన్, ఏజీపీ వరల్డ్, బీయింగ్ హ్యూమన్ - దీ సల్మాన్ ఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ కండల వీరుడు వేసిన మూడు పెయింటింగ్స్‌ని మార్చి 11 నుంచి 20 వరకు బెంగళూరులోని గ్యాలరీ జీలో ప్రదర్శనకి ఉంచనున్నారు. దానికంటే ముందు మార్చి 4న గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అందులో రెండు పెద్ద పెయింటింగ్స్‌ని ఈ నటుడు ‘స్టిల్ ఇన్ హోప్ ఆఫ్ కంపాషన్’,‘బిగ్గింగ్ ఫర్ పీస్’ పేరుతో చిత్రీకరించాడు.


ఈ పెయింటింగ్స్ వెనుక ఉన్న అర్థాన్ని సల్మాన్ ఇలా వివరించాడు..


స్టిల్ ఇన్ హోప్ ఆఫ్ కంపాషన్: అక్కడ చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. నష్టం జరుగుతోంది. అలాగే మహమ్మారి సైతం ప్రజలను ఇబ్బందిపెడుతోంది. కానీ వాటితో పాటు నమ్మకం కూడా ఉంది. ఎన్ని ప్రమాదాలు వచ్చిన చివరికి నమ్మకమే గెలుస్తుంది.


బెగ్గింగ్ ఫర్ పీస్ (శాంతి కోసం వేడుకోవడం): ఎటువంటి పొరపచ్చాలు లేకపోవడం శాంతి కాదు. రెండు చేతుల కలయిక శాంతి. మన మానవత్వానికి గుర్తింపు. మన జీవిత లక్ష్యం.


నిజానికి సల్మాన్‌కి మదర్ థెరిసా అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయనలోని సృజనాత్మక నైపుణ్యాన్ని ఆమెలోని మానవత్వానికి అంకితం ఇస్తుంటాడు. సల్మాన్ మాట్లాడుతూ.. ‘నా సినిమాలతో, నా కథలతో, నేను పాడే పాటలతో, నేను చెప్పే డైలాగ్స్‌తో మరికొన్నిసార్లు రంగుతో, ఖాళీ కాన్వాస్‌తో కూడా మానవత్వం గురించే చెప్పడానికి ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-03-04T21:19:44+05:30 IST