జర్నలిస్ట్‌పై దాడి కేసులో కోర్టు సమన్లు.. హైకోర్టుకు సల్మాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-04-05T21:34:42+05:30 IST

ఓ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ముంబైలోని ఓ కోర్టు సల్మాన్ ఖాన్‌కి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే...

జర్నలిస్ట్‌పై దాడి కేసులో కోర్టు సమన్లు.. హైకోర్టుకు సల్మాన్ ఖాన్

ఓ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై ముంబైలోని ఓ కోర్టు సల్మాన్ ఖాన్‌కి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కోర్టు సమన్లపై ఛాలెంజ్ చేస్తూ సల్లు భాయ్ హైకోర్టుని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేవతి మోహితే డేరే జడ్డిగా ఉన్న సింగిల్ బెంచ్ ఏప్రిల్ 5న విచారించనుంది.


సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌ తనపై దాడి చేశారని అశోక్ పాండే అనే జర్నలిస్టు 2019లో మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ విచారణ చేయాలని డీఎన్ నగర్ పోలీసులను ఆదేశించారు. వారు సమర్పించిన రిపోర్టుల ఆధారంగా గత నెలలో సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్ నవాజ్ షేక్‌ను ఏప్రిల్ 5న కోర్టు ముందు హాజరు కావాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో దిగువ కోర్టు ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈ బాలీవుడ్ నటుడు హైకోర్టును ఆశ్రయించాడు.

Updated Date - 2022-04-05T21:34:42+05:30 IST