రణ్‌వీర్ సింగ్ Jayeshbhai Jordaar కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు

ABN , First Publish Date - 2022-05-05T01:25:47+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh). అతడు హీరోగా నటించిన సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ (Jayeshbhai Jordaar)

రణ్‌వీర్ సింగ్ Jayeshbhai Jordaar కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh). అతడు హీరోగా నటించిన సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ (Jayeshbhai Jordaar). తాజాగా ఈ చిత్రం ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీకీ వ్యతిరేకంగా ఓ ఎన్జీవో కోర్టులో పిటిషన్ వేసింది. ట్రైలర్‌లో ఉన్న ఓ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ పిల్ దాఖలు చేసింది. 


‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. అందులో భాగంగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ ట్రైలర్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే సీన్  ఉంది. దీంతో ‘యూత్ ఎగైనిస్ట్ క్రైమ్’ (Youth Against Crime) అనే సంస్థ ఈ సీన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. పవన్ ప్రకాష్ పాఠక్ అనే న్యాయవాది ఈ పిల్‌ను కోర్టులో వేశారు. ‘‘లింగ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్ టెక్నిక్‌ను ఉపయోగిస్తారు. ఈ సీన్ సెన్సార్ చేయకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు బహిరంగంగా ప్రచారం కల్పించేలా ఉంది. ప్రీ కాన్‌సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్(పీసీపీఎన్‌డీటీ) -1994 ప్రకారం ఈ సీన్ చట్టవిరుద్ధం. అందువల్ల పిల్‌ను స్వీకరించాలి’’ అని పవన్ తెలిపాడు. జయేష్ భాయ్ జోర్దార్ సోషల్ కామెడీగా రూపొందింది. దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ( Yash Raj Films) పతాకంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మ నిర్మించారు. ఈ సినిమాలో షాలినీ పాండే (shalini pandey) హీరోయిన్‌గా నటించింది. బొమన్ ఇరానీ, రత్న పాఠక్, దీక్షా జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-05-05T01:25:47+05:30 IST