Alia Bhatt తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం చెప్పిన Ranbir Kapoor

ABN , First Publish Date - 2022-03-31T16:28:57+05:30 IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో అనే కాదు మొత్తం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం ఏంటంటే.. అది బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్ కపూర్, అలియాభట్ పెళ్లి ముచ్చటే...

Alia Bhatt తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం చెప్పిన Ranbir Kapoor

ప్రస్తుతం బాలీవుడ్‌లో అనే కాదు మొత్తం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం ఏంటంటే.. అది బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ రణ్‌బీర్ కపూర్, అలియాభట్ పెళ్లి ముచ్చటే. గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, సోషల్‌ మీడియాలో బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. 2018 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ క్రేజీ కపుల్స్‌ ఎప్పుడెప్పుడూ పెళ్లి పీటలు ఎక్కుతారా వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


అయితే.. రణ్‌బీర్ ప్రస్తుతం ఇటీవలే మరణించిన తన తండ్రి రిషి కపూర్ చివరి చిత్రమైన ‘శర్మాజీ నమ్‌కీన్’ ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇప్పుడైతే మీడియాకు తేది చెప్పలేను. కానీ నాకూ, అలియాకి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అభిమానులు ఓ అడుగు వేసి ఈ ఏప్రిల్‌లోనే వారిద్దరూ ఒక్కటవుతున్నారని ఊహాగానాలు చేస్తున్నారు.


ఈ పుకార్లపై రణబీర్ ఆంటీ రిమా జైన్ మాట్లాడుతూ.. ‘పెళ్లి గురించి నాకు ఇంకా ఏమీ తెలియదు. పెళ్లి చేసుకుంటారు కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. త్వరలోనే వారు ఓ నిర్ణయానికి వస్తారు. ఆ విషయాన్ని సడెన్‌గా అందరికీ చెబుతారు’ అంటూ తెలిపింది.

Updated Date - 2022-03-31T16:28:57+05:30 IST