నవాజుద్దీన్ సిద్దిఖీ షార్ట్ ఫిల్మ్‌కి అంతర్జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2022-02-10T22:24:33+05:30 IST

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో ఖచ్చితంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఉంటుంది. అది తన నటనతో ఎప్పటికప్పుడూ ఆయన నిరూపించుకుంటూనే ఉంటాడు...

నవాజుద్దీన్ సిద్దిఖీ షార్ట్ ఫిల్మ్‌కి అంతర్జాతీయ అవార్డు

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో ఖచ్చితంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఉంటుంది. ఈ విషయాన్ని న నటనతో ఎప్పటికప్పుడూ ఆయన నిరూపించుకుంటూనే ఉంటాడు. ఆయన నటన నైపుణ్యానికి ఇప్పటికే ఎన్నో సినీ అవార్డులు రాగా.. తాజాగా ఆయన సినిమా ఓ అంతర్జాతీయ అవార్డుని గెలుచుకుంది. సిద్ధిఖీ నటించగా అమెరికన్-బంగ్లాదేశీ-ఇండియన్ డ్రామాగా తెరకెక్కిన షార్ట్‌ఫిల్మ్ ‘నో ల్యాండ్స్ మ్యాన్’. ఈ చిత్రం తాజాగా నిర్వహించిన వెసోల్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ప్రిక్స్ డు పబ్లిక్’ అవార్డు గెలుచుకుంది.


ఈ విషయాన్ని సిద్ధిఖీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి.. ‘మా సినిమా ‘నో ల్యాండ్స్ మ్యాన్’ వీఐఎఫ్‌ఎఫ్‌లో ‘ప్రిక్స్ డు పబ్లిక్’ అవార్డు గెలుచుకుంది. సినిమా టీంకి, నా కో స్టార్ మెగాన్ మిచెల్‌కి, డైరెక్టర్ ఫరూఖీకి అభినందనలు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే ఈ నటుడికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రాగా.. అందులో ‘రామన్ రాఘవ్’ సినిమాకి గానూ ది ఆసియన్ అకాడెమీ అవార్డు కూడా ఉంది.




Updated Date - 2022-02-10T22:24:33+05:30 IST