Manoj Bajpayee: కథ, నటన ఎవరికీ అవసరం లేదు.. అందరి దృష్టి వాటిమీదే..

ABN , First Publish Date - 2022-05-11T16:10:46+05:30 IST

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఎప్పటి నుంచో సినీ కెరీర్‌లో..

Manoj Bajpayee: కథ, నటన ఎవరికీ అవసరం లేదు.. అందరి దృష్టి వాటిమీదే..

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఎప్పటి నుంచో సినీ కెరీర్‌లో ఉన్నప్పటికీ ఈ వెబ్‌సిరీస్‌తో ఒక్కసారిగా స్టార్‌గా మారిపోయాడు. అనంతరం వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  


ఇటీవల థియేటర్స్‌లో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అందులో ఎస్‌ఎస్ రాజమౌళి ‘RRR’ విడుదలైన నాలుగు వారాల్లో హిందీలో రూ.246 కోట్లు వసూలు చేసింది. అంతేకాకుండా విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లను కొల్లగొట్టింది. ప్రశాంత్ నీల్ ‘KGF Chapter 2’ అయితే హిందీలో ఏకంగా రూ. 400 కోట్లకి పైగా కలెక్షన్లని సాధించడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అలాగే..  వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిన్న బడ్జెట్ చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల మార్కును దాటేసింది.


తాజాగా ఈ సినిమాల గురించి మనోజ్ మాట్లాడుతూ.. ‘సినిమాల విషయంలో కథ గురించి లేదా ఇతర విభాగాల పనితీరు లేదా టీమ్ సహకారం గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అందరూ రూ.1000 కోట్లు, రూ.400 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్లు అనుకుంటూ ఆ చట్రంలో ఇరుక్కుపోయారు. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ చర్చ అంత త్వరగా ముగుస్తుందని నేను అనుకోవడం లేదు. అంతేకాకుండా విమర్శకులు సైతం అలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదని అడుగుతున్నారు.


అలాగే గతంలో నాలాంటి నటుడు చిత్రాలకు థియేటర్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. రూ.1000 కోట్ల సినిమాల వల్ల అది మరింత కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో OTTలు వరంగా మారాయి. ముఖ్యంగా నాలాంటి నటులకైతే అవి రావడం అదృష్టమనే చెప్పాలి. అలాగే ఎంతోమంచి కంటెంట్‌లో ఎంతో ప్రతిభ ఉన్న నటులు బయటికి వస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. మనోజ్ ప్రస్తుతం హాలీవుడ్ మూవీ శాండ్‌మ్యాన్‌లో ఓ పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడు. అలాగే దివాశిశ్ మకీజా దర్శకత్వంలో జోరం అనే థ్రిల్లర్ డ్రామాలో నటిస్తున్నాడు.

Updated Date - 2022-05-11T16:10:46+05:30 IST