‘పుష్ప’ చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన Family Man

ABN , First Publish Date - 2022-07-19T17:39:14+05:30 IST

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్నిభాషల్లోనూ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌‌లో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

‘పుష్ప’ చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన Family Man

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. విడుదలైన అన్నిభాషల్లోనూ చిత్రం రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌‌లో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘పుష్ఫ’ గా బన్నీ మేకోవర్, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌కు భారీ అప్లాజ్ దక్కింది. ఇందులోని పాటల్ని చాలా మంది సెలబ్రిటీస్ డబ్ స్మాషులుగా విడుదల చేసి సినిమాపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అల్లు అర్జున్ అభినయం, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, రష్మికా మందణ్న గ్లామర్ అపీరెన్స్, ఫహద్ ఫాజిల్ విలనిజం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ‘పుష్ప’ చిత్రం ఘనవిజయంలో ప్రధాన పాత్రలు పోషించాయి. అలాంటి ఈ సినిమాను ఎందరో బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. అవన్నీ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


‘పుష్ప’ చిత్రం విడుదలైన దాదాపు ఎనిమిది నెలలు అయిపోతున్నా.. దానిపై ప్రశంసల జల్లు ఇంకా కురుస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ఈ సినిమాను ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ చిత్రాలు ఏలే పరిస్థితిని ‘పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2’ చిత్రాలు నిరూపించాయి. ఒకప్పుడు సౌత్ సినిమాని చిన్నచూపు చూసిన బాలీవుడ్ పరిశ్రమ.. ఇప్పుడు సౌత్ హీరోలపైపు చూడడం గొప్ప పరిణామమని చెప్పాలి. ఈ నేపథ్యంలో మనోజ్ బాజ్‌పేయ్ చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలాన్ని చేకూర్చాయి. 


బాలీవుడ్ ను సౌత్ సినిమా డామినేట్ చేస్తోందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “మీరు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రాన్ని చూస్తే, మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ నిజానికి ఒక జీవన్మరణ పరిస్థితిలా చిత్రీకరించబడింది’.. అంటూ మనోజ్ ‘పుష్ప’ చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలిపారు.  మనోజ్ బాజ్‌పేయి ఈ వ్యాఖ్య చేసిన తీరు చూస్తే, ‘పుష్ప’ మేకర్స్ పుష్ప 2లో కీలక పాత్ర కోసం మనోజ్ బాజ్‌పేయ్‌ని సంప్రదించేట్టు ఉంది కదూ. అయితే పుష్ప 2 విషయంలో అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది.  ఇటీవల ‘ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న మనోజ్ ఇప్పుడీ వ్యాఖ్యలు చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. 

Updated Date - 2022-07-19T17:39:14+05:30 IST