ఆ ఫేమస్ Hollywood మూవీస్‌లో నటించాలని ఉందంటున్న Kartik Aaryan.. కారణం ఇదే అంటున్న యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-06-03T19:34:29+05:30 IST

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో కార్తీక ఆర్యన్ ఒకరు. ఈ యంగ్ హీరో ఎటువంటి సపోర్టు లేకుండా..

ఆ ఫేమస్ Hollywood మూవీస్‌లో నటించాలని ఉందంటున్న Kartik Aaryan.. కారణం ఇదే అంటున్న యంగ్ హీరో

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ నటుల్లో కార్తీక ఆర్యన్ ఒకరు. ఈ యంగ్ హీరో ఎటువంటి సపోర్టు లేకుండా బీ టౌన్‌లోకి అడుగుపెట్టి తనకంటూ గుర్తింపు పొందాడు. వరుసగా మంచి సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. కార్తీక్ తాజాగా నటించిన చిత్రం ‘భుల్ భులయ్యా 2’. ఇటీవలే విడుదలై ఈ మూవీ విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా విడుదలైన మూడు వారాల్లోనే దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


ఆ ఇంటర్వ్యూలో ఇటీవల మీరు చూసిన సినిమాలు ఏవి?.. అందులో మీకు నటించాలని అనిపించిన మూవీ ఏది? అని యాంకర్ కార్తీక్ అడిగారు. దానికి సమాధానంగా.. ‘ఇటీవల నేను థియేటర్‌లో మార్వెల్ మూవీ డా.స్ట్రేంజ్‌‌ని చూశాను. అది చూస్తున్నప్పుడు ఆ సినిమాలలో నాకు ఓ పాత్ర దక్కితే బావుండు అనిపించింది. ఎందుకంటే.. మార్వెల్ యూనివర్స్ టీంకి నిజమైన మేజిక్‌ని ఎలా సృష్టించాలో బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు.


అలాగే.. ఇటీవల నటనతో మిమ్మల్ని బాగా మెప్పించిన యాక్టర్ ఎవరూ అని కార్తీక్‌ని అడగగా.. ‘ఒక్కరి పేరని చెప్పలేను. మన పరిశ్రమలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. అంతేకాదు.. నా తరం నటులు సైతం చాలా అద్భుతంగా చేస్తున్నారు. గంగూబాయి కతియావాడిలో నటించిన అలియా భట్‌తోపాటు మరికొందరు మంచి నటులు ఉన్నారు’ అని తెలిపాడు.

Updated Date - 2022-06-03T19:34:29+05:30 IST