పెళ్లి చేసుకుంటే 20 కోట్లు ఇస్తానన్న లేడీ ఫ్యాన్.. యంగ్ హీరో రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-11T16:50:57+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఇంకా చెప్పాలంటే ఈ యంగ్ హీరోకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ...

పెళ్లి చేసుకుంటే 20 కోట్లు ఇస్తానన్న లేడీ ఫ్యాన్.. యంగ్ హీరో రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. ఇంకా చెప్పాలంటే ఈ యంగ్ హీరోకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆ విషయం ఈ యువ నటుడిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నవారికి తెలిసే ఉంటుంది. కొన్నినెలల క్రితం కార్తీక్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఆయన ఇంటిముందు గోల చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.


తాజాగా కార్తీక్ ఓ చిన్నారితో కలిసి చేసిన సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దానికి.. ‘క్యూటెస్ట్ అర్జున్ పటక్’ అంటూ ఆ పాప గురించి ఈ యంగ్ హీరో క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే దానికి ఈ యువ నటుడి లేడి ఫ్యాన్ పెట్టిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట చర్చకు వైరల్‌గా మారింది. అందులో ఆ ఫ్యాన్ డైరెక్ట్‌గా పెళ్లి చేసుకోమని నటుడిని సోషల్ మీడియాలో కోరింది. దానికి రూ.20 కోట్లు ఇస్తానని ఆఫర్ కూడా ఇచ్చింది. దానికి ‘ఎప్పుడు’ అంటూ కార్తీక్ రిప్లై కూడా ఇచ్చాడు. దీంతో ఆ కామెంట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.


దీంతో ఎంతోమంది ఇతర లేడి ఫ్యాన్స్ సైతం నన్ను పెళ్లి చేసుకో మేము డబ్బులు ఇస్తామని కామెంట్స్ రాసుకొస్తున్నారు. వాటికి కార్తీక్ స్పందిస్తూ ‘బిడ్డింగ్ మొదలైందా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా కొందరు నెటిజన్లైతే మీకు బాగా రిచ్ ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు అంటూ కామెంట్స్ సైతం చేస్తున్నారు.



Updated Date - 2022-03-11T16:50:57+05:30 IST