బాలీవుడ్‌లో రేపటి నుంచి RRR కు కలెక్షన్లు తగ్గుతాయా..? రాజమౌళి సినిమాకు పోటీగా..

ABN , First Publish Date - 2022-03-31T19:56:00+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మరోసారి తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ఇది. బాహుబలి తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం..

బాలీవుడ్‌లో రేపటి నుంచి RRR కు కలెక్షన్లు తగ్గుతాయా..? రాజమౌళి సినిమాకు పోటీగా..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. మరోసారి తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ఇది. బాహుబలి తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ పాన్‌ ఇండియా మూవీ రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా హిందీ బెల్ట్‌లో సైతం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మానియానే కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి కొత్తగా ఓ ప్రమాదం వచ్చిపడింది. అదే జాన్ అబ్రహాం నటించిన ‘ఎటాక్’.


జాన్ అబ్రహాంకి బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాక్షన్ సిక్వెన్స్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఈ హీరోగా తాజాగా నటించిన చిత్రం ‘ఎటాక్’ ఏప్రిల్ 1న విడుదల కానుంది. జాన్ నటించిన సత్యమేవ జయతే 2, బాట్లా హౌస్, పర్మా వంటి చిత్రాలు కరోనా టైంలో విడుదలై కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా ఎఫెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటించిన ‘ఎటాక్’ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాపై జాన్ అభిమానులకు భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కాబట్టి ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌నే రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాకి ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం హిందీ బెల్ట్‌లో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేకాకుండా జాన్ సినిమా సైతం యాక్షన్ ఎంటర్‌టైనర్ కావడం కూడా దీనికి ఉపకరించవచ్చు.

Updated Date - 2022-03-31T19:56:00+05:30 IST