మాజీ భార్యను పొగిడిన Hrithik Roshan

ABN , First Publish Date - 2022-06-03T21:41:43+05:30 IST

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan), సుసానే ఖాన్(Sussanne Khan) ఏడేళ్ల క్రితమే విడిపోయారు. తమ 13ఏళ్ల దాంపత్య జీవితానికి ఈ జంట గతంలోనే ముగింపు పలికారు. దంపతులుగా

మాజీ భార్యను పొగిడిన Hrithik Roshan

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan), సుసానే ఖాన్(Sussanne Khan) ఏడేళ్ల క్రితమే విడిపోయారు. తమ 13ఏళ్ల దాంపత్య జీవితానికి ఈ జంట గతంలోనే ముగింపు పలికారు. దంపతులుగా విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉన్నారు. అనంతరం హృతిక్ అప్‌కమింగ్ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. సుసానే ఖాన్, అర్స్‌లన్ గోని అనే వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది. కానీ, ఈ బంధాలపై వీరు ఎక్కడ పెదవి విప్పలేదు. 


హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియో కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘మీ చుట్టు మంచివారిని ఉంచుకుని ప్రపంచాన్ని అద్భుతంగా మార్చుకొండి’’ అని సుసానే తెలిపింది. సుసానే షేర్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో హృతిక్ రీపోస్ట్ చేశాడు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘‘సుసానే నిన్ను చూసి గర్విస్తున్నాను. నువ్వు సూపర్ స్టార్‌వి’’ అని హృతిక్ ఆమెను ప్రశంసించాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. హృతిక్ ప్రస్తుతం ‘ఫైటర్’(Fighter) లో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘విక్రమ్ వేద’ రీమేక్‌లోను హృతిక్ కనిపించనున్నాడు. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.



Updated Date - 2022-06-03T21:41:43+05:30 IST