తన పెళ్లిలోని స్పెషల్ పిక్ షేర్ చేసిన ఫర్హాన్ అక్తర్

ABN , First Publish Date - 2022-02-24T01:32:48+05:30 IST

బాలీవుడ్‌లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి

తన పెళ్లిలోని స్పెషల్ పిక్ షేర్ చేసిన ఫర్హాన్ అక్తర్

బాలీవుడ్‌లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్. ఐపీఎల్ మాజీ యాంకర్ శిబానీ దండేకర్‌‌ను ఫర్హాన్ ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట ఫిబ్రవరి 19న ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి బీ టౌన్ నుంచి పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. రియా చక్రవర్తి, హృతిక్ రోషన్, అనుష దండేకర్ వంటి సెలెబ్రిటీలు ఫర్హాన్, శిబానీ వెడ్డింగ్ సెర్మనీలో సందడి చేశారు.


ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహాం అయింది. ఈ దంపతులకు అకీరా, శాక్య అనే ఇద్దరు కూతుళ్లున్నారు. ఏమైందో తెలియదు కానీ, కొన్నాళ్లకు ఈ దంపతుల మధ్య మనస్పర్థాలు తలెత్తాయి. దీంతో ఫర్హాన్ 2017లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శిబానీతో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ వివాహానికి ఫర్హాన్ కూతుళ్లతో పాటు ఎవరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఫర్హాన్, శిబానీ కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ హీరో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన కూతుళ్లతో కలిసి పెళ్లిలో తీసుకున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోల కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫన్‌టైం’’ అని పేర్కొన్నాడు. ఫర్హాన్ చివరగా ‘తూఫాన్’ లో నటించాడు. రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించాడు. అతడు త్వరలో ‘జీ లే జరా’ అనే చిత్రానికి డైరెక్షన్ చేయనున్నాడు.



Updated Date - 2022-02-24T01:32:48+05:30 IST