Prabhas-Maruthi: ప్రభాస్‌కు తాతగా బాలీవుడ్ నటుడు..?

ABN , First Publish Date - 2022-10-19T20:39:29+05:30 IST

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ చేసిన సినిమాలవేవీ కమర్షియల్‌‌గా విజయం సాధించలేదు.

Prabhas-Maruthi: ప్రభాస్‌కు తాతగా బాలీవుడ్ నటుడు..?

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్  చేసిన సినిమాలవేవీ కమర్షియల్‌‌గా విజయం సాధించలేదు. ‘సాహో’ (saaho), ‘రాధేశ్యాం’ (Radhe Shyam) చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో భారీ హిట్ కొట్టాలని మారుతి (Maruthi) దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు డార్లింగ్ అంగీకరించాడు. ఈ మూవీకి సంబంధించిన ఫొటోషూట్ ఈ మధ్యనే ముగిసింది. సినిమా షూటింగ్ కూడా ఈ వారంలోనే ప్రారంభం కానుంది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించనున్నారని పిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ (Raja Deluxe) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్‌లో షికార్లు కొడుతుంది. రాజా డీలక్స్ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు కనిపించబోతున్నాడని సమాచారం.    


‘రాజా డీలక్స్’ లో ప్రభాస్ తాత పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందట. అందువల్ల ఈ పాత్రకు బాలీవుడ్ నటుడు అయితే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఈ రోల్‌ కోసం బొమన్ ఇరానీ (Boman Irani)ని సంప్రదించగా అంగీకరించాడని తెలుస్తోంది. గతంలో బొమన్ ఇరానీ ‘అత్తారింటికి దారేది’, ‘బెంగాల్ టైగర్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. ప్రభాస్- మారుతి సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తుంది. మూవీలో హార్రర్ అంశాలు కూడా మేళవించినట్టు సమాచారం. మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్స్‌గా నటించనున్నారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ‘ఆది పురుష్’ (Adipurush) షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ‘ప్రాజెక్ట్-కె’, ‘సలార్’ (Salaar) షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాల షూటింగ్ 50శాతానికి పైగా పూర్తయింది. ఈ రెండు ప్రాజెక్టుల మధ్యనే మారుతితో మూవీని పట్టాలెక్కించనున్నాడు. 




Updated Date - 2022-10-19T20:39:29+05:30 IST