సల్మాన్ సినిమా పాట వీడియోకి ‘ఊ అంటావా’ ఆడియో.. వైరల్ అవుతున్న అనుపమ్ ఖేర్ రీల్

ABN , First Publish Date - 2022-02-05T17:11:12+05:30 IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతమంచి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే...

సల్మాన్ సినిమా పాట వీడియోకి ‘ఊ అంటావా’ ఆడియో.. వైరల్ అవుతున్న అనుపమ్ ఖేర్ రీల్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతమంచి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ చిత్రం 50 రోజుల్లో ఓవరాల్‌గా 365 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


ముఖ్యంగా ఈ సినిమాలాగే ఇందులో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. అందుకే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కి రీల్స్ చేశారు. తాజాగా బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సైతం ఓ రీల్ చేశారు. అది సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘హమ్ అప్ హైన్ కోన్’లోని పాట ‘ఆజ్ తుమార్హీ దిల్ మే’ వీడియోకి.. ‘ఊ అంటావా’ పాట ఆడియోని కలిపి ఏడిట్ చేసి పోస్ట్ చేశారు. 


దానికి ‘ట్రెండ్‌లో కోసమే ఇలా చేశాను. ‘హమ్ అప్ హైన్ కోన్’ నుంచి ఒక ఐకానిక్ పాట పుష్ప సినిమాలోని ఎంతో ప్రజాదరణ పొందిన పాటను ఇలా ప్రశంసించింది’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్, సమంతకి యాష్ ట్యాగ్ సైతం ఇచ్చారు. ఆ వీడియోలో ఎంతో బాగా లిప్‌సింక్ అయ్యింది. దీంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-02-05T17:11:12+05:30 IST